అయితే ఆంటీ అనే పదం కారణంగా ఆడవాళ్ళ మధ్య గొడవలు జరిగిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకో తెలియదు కానీ కొంతమంది లేడీస్ మాత్రం ఆంటీ అంటే ఎంతో నామోషీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదేదో బూతు మాట అన్నట్లుగా అనుకుంటూ ఉంటారు అని చెప్పాలి. పొరపాటున ఎవరైనా ఇలా ఆంటీ అని పిలిచారు అంటే వారితో గొడవ పడటానికి కూడా రెడీ అవుతూ ఉంటారు కొంతమంది మహిళలు. అచ్చం సినిమాల్లో ఆంటీ అంటే ఎలా నటీమణులు ఫీలవుతారో నిజ జీవితంలో కొంతమంది కూడా ఇలాగే బిహేవ్ చేస్తూ ఉంటారు.
అయితే చెన్నైలో కూడా ఇలాంటి తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఆంటీ అని పిలిచినందుకు ఒక మహిళ చేసిన పని గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. ఏకంగా బస్ కండక్టర్ పైనే మహిళ ఆంటీ అని పిలిచినందుకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. పాపం ఆమె వయస్సు తక్కువగా ఉంటుందేమో అందుకే అంత కోపం వచ్చింది అనుకుంటారా.. ఆమె వయసు ఎంతో తెలుసా ఏకంగా 57ఏళ్ళు. నిర్మల దేవి అనే మహిళ బస్సులో ప్రయాణిస్తుంది. కాగా కండక్టర్ కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నారు ఆంటీ అని అడిగాడు. దీనిపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోసారి ఆంటీ అని పిలవడంతో భర్తతో కలిసి పిఎస్ కు వెళ్లి కేసు పెట్టారు. కండక్టర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి