
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం వల్ల రాష్ట్రాభివృద్ది కుంటు పడిందని చెబుతూ ప్రజల్లోకి వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. అయితే వైఎస్ వివేకా హత్య కేసు జగన్ కు కొరకరాని కొయ్యలా మారింది. అవినాష్ రెడ్డి ప్రధాన నిందితుడిగా ఉండటం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది. ప్రజల్లోకి వెళ్లి ఓటు అడిగే సమయంలో ఇది ఎక్కువ ప్రభావం చూపేలా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ టీడీపీ, జనసేన ను ఎదుర్కొని నిలుచోవాలంటే జగన్ ముందస్తుకు వెళ్లాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంలో నిజ నిజాలను పక్కనబెడితే గత ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్లి తన సత్తా నిరూపించుకున్నారు.
సాధారణ ఎన్నికలు వచ్చే నాటికి ఎమ్మెల్యే స్థానాల్లో గెలిచిన ప్లేస్ లోనే ఎంపీ స్థానాలను టీఆర్ఎస్ పార్టీ పొగొట్టుకుంది. అంటే ఆరు నెలల్లోనే ప్రజల్లో మార్పు వచ్చింది. ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటే ముందస్తు ఫలితం వైసీపీకి బాగు చేస్తుందని అనుకుంటున్నారు. చంద్రబాబు కేంద్రం మమ్మల్ని అణిచి వేస్తోందనే ప్రచారం చేసుకునే వారు. కానీ ఇప్పుడు సీబీఐ దాడి చేస్తుందని కానీ కేంద్రాన్ని నిందించి సానుభూతి పొందే అవకాశం జగన్ కు లేదు. కాబట్టి వైసీపీ అధినేత పరిస్థితి అడ కత్తెరలో పోక చెక్కలా తయారైంది.