కోనసీమ జిల్లాలో రైతులు ఈ ఏడాది పంట వేసేది లేదంటున్నారు. క్రాప్ హాలిడే ప్రకటిస్తామంటున్నారు. కాలువలు బాగు చేయలేదని.. నీళ్లు రావడం లేదని.. పంట వేసి నష్టపోయే కంటే వేయకుండా ఉండటమే మేలని భావిస్తున్నామని అంటున్నట్టు కొన్ని మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. కొన్ని మండలాల్లో రైతులు తహశీల్దార్లకు ఈ మేరకు వినతి పత్రాలు ఇస్తున్నారు. ఈ విషయం చివరకు కలెక్టర్ వరకూ వెళ్లింది. అసలు విషయం తెలుసుకుందామని కలెక్టర్ కూడా పలు మండలాల్లో పర్యటించారు.


రైతుల సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. అయితే.. ఈ క్రాప్ హాలిడే ఉద్యమంపై వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి స్పందించారు. ఇదంతా కేవలం ప్రతిపక్షాల గోబెల్స్ ప్రచారమే నని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అంటున్నారు. తెలుగుదేశం,  కొంతమంది ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు రైతుల్ని రెచ్చగొడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఆరోపించారు. రైతులను రోడ్ల మీదకు తీసుకొచ్చి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అంటున్నారు.


వైఎస్ జగన్ అధికారం చేపట్టాక, రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు పడుతున్నాయని..  మూడేళ్ళలో రాష్ట్రంలో ఒక్క కరువు మండలం కూడా లేకుండా పంటలు బాగా పండుతున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి చెబుతున్నారు. ఇలా ఉంటే ఎవరైనా ఎందుకు క్రాప్ హాలిడేలు ఎందుకు ప్రకటిస్తారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ప్రశ్నించారు. క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితులుగానీ రాష్ట్రంలో లేవని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అంటున్నారు.


చంద్రబాబు కాలంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని ఆ బురదను మా ప్రభుత్వంపై రుద్దేందుకే టీడీపీ తాపత్రయం తప్ప మరొకటి కాదని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి అంటున్నారు. అయితే..  కనీస మద్దతు ధరలపై స్వామినాథన్ సిఫార్సులను అనుసరించాలని కేంద్రానికి లేఖలు రాసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: