భారతీయ జనతా పార్టీ ఆంధ్రలో తెలుగుదేశంతో ఎలాగో పొత్తు పెట్టుకోదు. కామినేని దూరం అయ్యారు. ప్రస్తుతం కన్నా లైన్ క్లియర్ అయింది. ఆ తర్వాత విష్ణుకుమార్ రాజు, ఆది నారాయణ రెడ్డి, పురందేశ్వరి ఇలా ఒక్కొక్కరు బీజేపీని వీడి టీడీపీ లో చేరేందుకు రూట్ క్లియర్ చేసుకున్నారు. ఎందుకంటే వీరిని కోవర్టులు అంటుంటారు. కానీ వీరంతా తెలుగుదేశం పార్టీలో ఉండకుండా బీజేపీ లో చేరి టీడీపీకి సమాచారాలు అందించేవారు. సుజనా చౌదరి లాంటి వారు కూడా బీజేపీలో ఎన్నికలు అయ్యాక చేరిపోయారు. వీరంతా ఒక రకంగా టీడీపీకి పని చేయడానికి సిద్ధమైన వారే. ఎందుకంటే ఎన్నికలు వచ్చే సరికి టీడీపీ, బీజేపీని కలిపి ఉంచేందుకు శాయశక్తులా పని చేశారు. కానీ అధిష్టానం ఒప్పుకోవడం లేదు.


దీంతో బీజేపీని వీడి మళ్లీ సొంత గూటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కన్నా బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగితే టీడీపీతో పొత్తు సులభమయ్యేది. కానీ సోము వీర్రాజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక కుదరడం లేదు. దీంతో సోము వీర్రాజును, బీజేపీని టార్గెట్ చేశారు. బీజేపీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తులు ఎవరూ వెళ్లడం లేదు. తెలుగుదేశం ఉద్దేశాలకు అనుగుణం పని చేసిన వారు ప్రస్తుతం చంద్రబాబు చెంతకు వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు.


కన్నా బీజేపీ అధ్యక్షుడయ్యాక ఆంధ్రలో బీజేపీకి ఓటింగ్ శాతం 1.2 శాతానికి పడిపోయింది. గతంలో కంటే 4 శాతంగా ఉన్న ఓటింగ్ 1.2 కు పడిపోవడం దారుణం. అదే సమయంలో దేశ వ్యాప్తంగా బీజేపీ 303 స్థానాలు గెలుచుకుని రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం చతికిలపడిపోయింది. దీని వల్ల బీజేపీకి ఆంధ్రలో తీవ్ర నష్టం జరిగింది. దీనికి కారణం ఏపీలో టీడీపీ వేసిన ఎత్తుగడల్లో బీజేపీ చిత్తవడమే. దానికి చంద్రబాబు సారథ్యం వహిస్తే, కన్నా యాక్టింగ్ చేశారు. ఏదేమైనా బీజేపీ నుంచి టీడీపీలోకి చేరికలు మాత్రం ఆగడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP