రష్యా అధ్యక్షుడు పుతిన్ వణికిపోతున్నాడు.. భయస్తుడు, ఇల్లు దాటి రాడు. ఎవ్వరికీ కనిపించడు. ఇంటర్నెట్ వాడడు. ఫోన్ కూడా వాడడు. భోజనం చేసే ది కూడా ఇతరులు టేస్ట్ చేసిన తర్వాతనే అని, తాజాగా పుతిన్ కు సెక్యూరిటీగా చేసిన సీక్రేట్ పర్సనల్ సెక్యూరిటీ అధికారి బహిరంగంగా అమెరికా మీడియాకు తెలిపాడు. కరోనా టైంలో  అసలు బయటకు కూడా రాలేదు. పబ్లిక్ కు దూరంగా ఉండేవాడు. బయటకు రావడానికి అస్సలు ఇష్టపడే వాడు కాదని, పుతిన్ చాలా భయస్తుడని పుతిన్ కు సెక్యూరిటీగా చేసిన అధికారి గ్లెబ్ కర్కో అమెరికా మీడియాతో మాట్లాడుతూ పుతిన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.


గతంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సైతం పుతిన్ చనిపోయాడు.. ఆయనకు బ్లడ్ క్యాన్సర్ ఉందని అన్నారు. అమెరికా మీడియా అయితే మెట్ల పై నుంచి పడ్డాడని, ఆయన వెన్నుపూస దెబ్బతిందని, నడవలేని పరిస్థితుల్లో ఉన్నాడని, క్యాన్సర్ తో చివరి దశలో ఉన్నారని ప్రచారం చేసింది. ఇదంతా అమెరికా చేయిస్తున్న మోసపూరిత ప్రచారం అని తర్వాత బట్టబయలైంది.


ఎందుకంటే పుతిన్ అన్ని దేశాల అధ్యక్షులతో మాట్లాడుతున్నారు. తాజాగా ఉక్రెయిన్ లోని మరియపోల్ లో దిగి అక్కడ ఉండే రష్యన్ మాట్లాడే పౌరులతో సంభాషించారు. ఇలా ప్రపంచ దేశాల అధినేతలతో మాట్లాడుతూ.. బిజీ బిజీగా గడుపుతున్న రష్యా అధ్యక్షుడిని మానసికంగా దెబ్బకొట్టాలని అమెరికా భావిస్తోంది. దీని పర్యవసానమే పుతిన్ పై విష ప్రచారం.


ఇన్ని రోజులు చేసిన ప్రచారం ఒకెత్తయితే ప్రస్తుతం ఏకంగా పుతిన్ కు సెక్యూరిటీగా ఉన్న వ్యక్తితో ప్రచారం చేయించడం అనేది అమెరికా వేసిన ఎత్తుగడగా తెలుసుకోవచ్చు. ఎన్ని ఎత్తులు వేసినా దాని గురించి పట్టించుకోకుండా విలేకరులతో కూడా కరాఖండిగా ఈ మధ్యే పుతిన్ మాట్లాడారు. అనవరసర ఆరోపణల గురించి కాకుండా అసలైన విషయం ఏదైనా ఉంటే అడగండి లేకపోతే విడిచిపెట్టండని రిపోర్టర్లకే పుతిన్ చురకలంటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: