
ప్రస్తుతం ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి పొంగులేటి ప్రత్యేకంగా జిల్లాలో ఆత్మీయ సమ్మేళనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పొంగులేటి మొన్నీ మధ్య మాట్లాడుతూ.. ఏదైనా జాతీయ పార్టీలో చేరతానని ప్రకటించారు. దీంతో బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈయనతో పాటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావును కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఇలా ఒక్కో అసమ్మతి నేతల్ని పార్టీ నుంచి సీఎం కేసీఆర్ బహిష్కరిస్తున్నారు.
ఈ సమయంలో పొంగులేటికి ఖమ్మం జిల్లాలో మంచి పట్టుంది. ఆయన ప్రస్తుతం వైఎస్సార్ టీపీ పార్టీ షర్మిల వైపు చూస్తున్నట్లు సమాచారం. ఆయన 2014 లో వైసీపీ తరఫునే గెలిచారు. 2019 లో టికెట్ కు టీఆర్ ఎస్ నిరాకరించింది. ఇప్పుడు బీఆర్ ఎస్ లో నుంచి తొలగించింది. గతంలో కమ్యూనిస్టుల అండతో గెలిచారని పొంగులేటికి పేరుంది. ఇప్పుడు కమ్యూనిస్టుల మద్దతు ఆయనకు ఉంటుందా ఉండదా. సీపీఎం పార్టీకి మిగిలిన ఒకే ఒక జిల్లా ఖమ్మం. ఇక్కడే కాస్త వారికి పట్టుంది. మరి పొంగులేటికి మద్దతు తెలుపుతారా? లేక సీపీఎం పార్టీ తన అభ్యర్థులనే రంగంలోకి దించుతుందా చూడాలి.