సూడాన్ నుండి భారతీయులందరిని తీసుకురావడానికి బయలుదేరారు మన సైన్యం. వాళ్లని తీసుకురావడానికి   యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు కూడా బయలుదేరాయి. ఇలాంటి వాహనాల్లో వెళ్తున్నారంటే అర్థం, వీళ్ళు యుద్ధానికి వెళ్తున్నారని  కాదు. అక్కడ మన సైనికుల దగ్గర ఉండే వాహనాలు ఈ యుద్ధ నౌకలు, ఈ యుద్ధ విమానాలే కాబట్టి వాటిలో వెళ్లి భారత్ పౌరులను మన దేశానికి తీసుకురావడానికి అక్కడికి వెళ్లారు వాళ్ళు.


సంపాదనపరంగా భారత్ లో, మిగిలిన దేశాలతో పోల్చితే తక్కువగా ఆదాయం వస్తుందనో, తక్కువ కాలంలో ఇంకా ఎక్కువ సంపాదించాలనో  అనుకుని దూర తీరాల్లోకి, విదేశాల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఇక్కడ కన్నా ఎక్కువ సంపాదిస్తారు, అది నిజమే. కానీ మన ప్లేస్ కానీ ప్లేస్ లో మనకి ఏదైనా ఆపద వస్తే అక్కడ మనల్ని కాపాడేది ఎవరూ అనే ప్రశ్నకి వెంటనే సమాధానం దొరకదు. కానీ మన భారతీయులు ఏ దేశంలో ఉన్నా, వాళ్ళు ఏ కష్టంలో ఉన్నా కూడా మన భారతదేళ ప్రభుత్వం వాళ్లని జాగ్రత్తగా చంటి పాపల్లా కాపాడుకుంటూ వస్తుంది.


తాజాగా సూడాన్ లో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలో నలిగిపోతున్న భారతీయులను, ప్రాణాలు ప్రమాదంలో పడ్డ భారతీయులను రక్షించడానికి భారత సైన్యం పూనుకుంది. వెంటనే యుద్ధ నౌకలతో, యుద్ధ విమానాలతో హుటాహుటిన బయలుదేరి అక్కడికి చేరుకుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక క్రమంలో తీసుకుంటూ వస్తుంది.


ఆ క్రమాన్ని బట్టి అక్కడ ఉన్న వాళ్ళలో పెద్ద వయసు ఉన్న వాళ్ళని, అనారోగ్యం ఉన్న వాళ్ళని, మహిళలను, చిన్నపిల్లలను ముందుగా సురక్షిత ప్రాంతానికి తరలిస్తుంది. భారత్ కి వచ్చేలోగా ముందుగా వాళ్లకి తగిన ఆహారాన్ని, ఉన్నంతలో వసతిని కల్పిస్తుంది ఇప్పుడు అలా చేరిన ప్రజలందరూ కలిసి అక్కడ సైనిక అధికారితో కలిసి చేసిన నినాదం భారత్ మాతాకీ జై. అందుకే అంటారు "ఏ దేశమేగినా ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని" అని.

మరింత సమాచారం తెలుసుకోండి: