రాష్ట్రంలో ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలు మూతపడనున్నాయి అంటే అవుననే వినిపిస్తోంది. రాష్ట్రంలో 418 ప్రైవేట్‌ ఎయిడెడ్‌ పట్షలల్ వరకు మూతపడే అవకాశం కనిపిస్తోంది . ఈ పాఠశాలలన్నింటినీ మూసేసే దిశగా చర్యలు తీసుకోవాలి అంటూ సర్కారు ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం. అయితే ఈ పాఠశాలలకు పలుమార్లు నోటీసులు ఇచ్చింది ప్రభుత్వం. ఒక్కో స్కూల్లో 8 నుంచి 35 మంది వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఈ సంఖ్య చాలా తక్కువని.. ఇంత చిన్న సంఖ్యతో పాఠశాలను నడిపించలేమని విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆదేశాలు జారి చేసింది.

ఈ క్రమంలో కొన్ని ప్రైవేట్ ఎయిడ్ స్కూల్స్ తమ విద్యార్థుల సంఖ్యను పెంచుకోగా మరికొన్ని మాత్రం అదే సంఖ్యను కలిగి ఉండటం, ఇంకా కొందరు పిల్లల్ని తమ పాఠశాలల నుండి కోల్పోవడం వంటివి జరిగాయి. కాగా ఇపుడు విద్యార్థుల ప్రవేశాలను పెంచుకున్న పాఠశాలలు మినహా మిగిలిన 418 పాఠశాలలపై చర్యలు తీసుకోవాలంటూ రెండు రోజుల క్రితం పాఠశాల విద్యా కమిషనర్‌ ఎస్‌. సురేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. త్వరలో ఈ పాఠశాలలకు తాళం పడే అవకాశం ఉంది. అక్కడ చదువుతున్న విద్యార్థులను దగ్గరగా ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ లో జాయిన్ చేసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులంతా నిరుపేద కుటుంబం నుంచి వస్తున్న వారే.
ఈ పాఠశాలలో క్రిస్టియన్‌ సంస్థలవే ఎక్కువ గా ఉండగా కొన్ని మాత్రమే హిందూ ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఇటువంటి ప్రైవేట్ పాఠశాలలు కొనసాగుతుండగా...  వైసీపీ అధికారం లోకి వచ్చాక ఈ స్కూల్స్ మొత్తాన్ని ప్రభుత్వంలో విలీనం చేసుకోబోతున్నట్లు జీవోలు జారీ చేసింది. అయితే విమర్శలు, సమస్యలు  ఎదురుకావడంతో తో ఇష్టమైన ఎయిడెడ్‌ పాఠశాలలనే ప్రభుత్వం లో విలీనం చేసుకుంటామని, ఇష్టం లేనివి ఇక ప్రైవేటు పాఠశాలలుగా కొన సాగవచ్చని మళ్ళీ కొత్త ఉత్తర్వులను ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: