దరిద్రం కూడా అదృష్టం పట్టినట్టు పట్టిందేమో తెలియదు కానీ టీడీపీ అధినేత చంద్రబాబు కి వరుస వరుసగా అన్ని కష్టాలు ఒకేసారి ముంచుకొస్తూ ..మీద పడిపోతున్నాయి. అసలు చంద్రబాబు కి ఇన్ని కష్టాలు రావడం .. ఇంత ఆందోళన చెందడం ఇవన్నీ ఎవరో పనిగట్టుకుని పురమాయిస్తున్నవి కాదు స్వయంగా ఆయన చేసుకున్న స్వయంకృపరాధాలే అన్న సంగతి ఇప్పుడిప్పుడే బయటకి వస్తుండడం సొంత నేతలనే ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎక్కడో తీగ లాగితే ఇక్కడ బాబు గారి డొంక అంతా బయటకి వచ్చేయడం కాస్త వింతగా ఉన్నా ... బయటపడుతున్న నిజాలు చూస్తే మాత్రం నోరెళ్లబెట్టేలా ఉన్నాయి. అసలు బాబు మీద వైసీపీ వాళ్ళకి లేనంత కోపం, కక్ష ఆ బీజేపీ వాళ్లకు ఎందుకబ్బా అని ఆలోచిస్తే అసలు విషయం అర్ధం అవుతుంది. పదండి మ్యాటర్ లోకి వెళదాం....

 

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన వద్ద సీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ వ్యవహారం ఇప్పుడు వచ్చింది. ఆయన ఆస్తులపై దాడులు నిర్వహించగా ఐటీ శాఖకు రెండు వేల కోట్ల రూపాయల వరకు అవినీతి వ్యవహారాలకు సంబంధించి కీలక ఆధారాలు బయటపడ్డాయి. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అహ్మద్ పటేల్ కు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయనే విషయం బయటకు వచ్చింది. సుమారు 400 కోట్ల రూపాయల డబ్బు హవాలా రూపంలో అహ్మద్ పటేల్ వెళ్లినట్లు ఆధారాలు ఐటీ శాఖ వద్ద ఉన్నాయి. గత లోక్ సభ ఎన్నికల సమయంలో ఆంధ్రా నుంచి కాంగ్రెస్ పార్టీకి నాలుగు వందల కోట్ల రూపాయలు వెళ్లినట్టుగా ఆదాయపన్ను శాఖ గుర్తించింది. దీంతో అహ్మద్ పటేల్ కు నోటీసు జారీ అయ్యింది.


 ఈ మేరకు ఆయనకు ఫిబ్రవరి 14 హాజరు కావాలంటూ నోటీసులు పంపగా ఆయన స్పందించలేదు. దీంతో మరోసారి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. పద్దెనిమిదో తారీఖున తమ ముందు హాజరు కావాలని కోరింది. దీంతో తనకు ఆరోగ్య సమస్యలు తలెత్తి ఆసుపత్రిలో చేరారని, తాను విచారణకు హాజరు కాలేను అంటూ ఆయన సమాధానం పంపించారు. అసలు చంద్రబాబు పీఎస్ ఇంటి వద్ద దొరికిన ఆధారాలు.. అహ్మద్ పటేల్ కు లింక్ ఎక్కడ ఉంది అంటే..?  బిజెపి కేంద్రంలో అధికారంలోకి రాకుండా చేసేందుకు చంద్రబాబు గట్టిగానే ప్రయత్నించినట్లుగా బీజేపీకి తగినన్ని సాక్ష్యాలు లభించాయి.


సుమారు ఐదారు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను గట్టెక్కించేందుకు చంద్రబాబు ముందుకు రావడమే కాకుండా.. రాష్ట్రానికి సంబంధించిన సొమ్ములను కాంగ్రెస్ గెలుపు కోసం ఆయా రాష్ట్రాలకు పంపించినట్టు గా ఆధారాలు లభించాయి. వీటిని నేరుగా కాకుండా అమరావతి భవన నిర్మాణ కాంట్రాక్టులు పొందిన సంస్థ ద్వారా ఈ వ్యవహారం జరిగినట్లుగా బీజేపీకి ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా బుక్కయిపోయినట్టుగానే అంతా అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అహ్మద్ పటేల్ కు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఆయనను మరికొద్ది రోజుల్లో అయినా విచారించే అవకాశం కనిపిస్తోంది.


మొత్తం ఈ వ్యవహారాన్ని అహ్మద్ పటేల్ బయటపెడితే వాటి ఆధారంగా చంద్రబాబును బుక్ చేసేందుకు కేంద్రం ఐటీ శాఖ సిద్ధమవుతోంది. వీటితో పాటు  మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా బీజేపీకి ఆగ్రహం కలిగించడంతోనే చంద్రబాబుపై ఈ స్థాయిలో ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్  ప్రభుత్వం టిడిపి విషయంలో కక్షసాధింపు ధోరణి అవలంబించకపోయినా బీజేపీ మాత్రం చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాలను ఒక్కొక్కటిగా బయటకు తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలని కంకణం కట్టుకున్నట్లు ప్రస్తుతం పరిస్థితులను బట్టి అర్థమవుతోంది.


ప్రస్తుతం ఈ కేసు లో ముందు ముందు మరిన్ని పెద్ద తలకాయలు  బయటపడే అవకాశం కనిపిస్తోంది.ఈ  వ్యవహారం తెలిసినప్పటి నుంచి చంద్రబాబు మరింత ఆందోళనకు గురవుతున్నట్లు సమాచారం. అందుకే హైదరాబాద్ ను వదిలి బయటకు వచ్చేందుకు ఆయన ఇబ్బందిపడుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం ఇంకా ఎక్కడ వరకు వెళుతుందో... ఎవరెవరు ఈ కేసుల్లో ఉన్నారు అనేది మరికొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే ఐటీ దాడులు టిడిపి నాయకుల పాత్రపై ఐటీ శాఖ అన్ని ఆధారాలు సంపాదించింది. వాటి ఆధారంగానే ఇప్పుడు దేశవ్యాప్తంగా బాబు తో ఆర్ధిక లావాదేవీలు నడిపిన వారంతా బయటపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: