వ్యాక్సీన్ ఫ్రీగా ఇస్తారు నిజమే.. కానీ ఎప్పుడు.. దీనిపై స్పష్టత లేదు. ఈనెల 21 నుంచి ఉచిత వ్యాక్సీన్ అని మోడీ ఘనంగా ప్రకటించారు. కానీ టీకాలు ఏవీ.. ఇంకో విశేషం ఏంటంటే.. వ్యాక్సీన్ ఫ్రీ అంటూనే మళ్లీ ప్రైవేటు వేయించుకునే వారి కోసం 25 శాతం టీకాలు సదరు కంపెనీలు అమ్ముకుంటాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వీటి ధరలు కూడా ప్రకటించారు. కోవాగ్జీన్ 1400 వరకూ.. కోవిషీల్డ్ 750 వరకూ రేటు పెట్టేశారు. దేశమంతా ఫ్రీగా వ్యాక్సీన్ ఇస్తాం అన్నప్పుడు ఇక ఈ 25 శాతం మాత్రం ఎందుకు అన్న అనుమానాలు వస్తున్నాయి.
అంతే కాదు.. వ్యాక్సీన్ ఉత్పత్తిలో 25 శాతం ప్రైవేటుగా అమ్ముకోవచ్చు అంటున్నారు. కానీ సదరు సంస్థ ఎంత ఉత్పత్తి చేస్తుందో ఏం లెక్కలు చూపిస్తుందో నమ్మేదెలా.. ఉత్పత్తి తక్కువ అవుతుందని చెప్పే.. చేసిన ఉత్పత్తిని ప్రైవేటుగానే ఎక్కువ శాతం అమ్ముతుంటే అడ్డుకునేదెవరు. ఎలాగూ ప్రభుత్వ టీకా లేటవుతుందన్న భయంతో జనం ప్రైవేటుగానే టీకా వేయించుకునేందుకు మొగ్గుచూపుతారు. మరి అందుకే ఈ ప్రైవేటు దోపిడీకి మోడీ ఓకే చెప్పారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సదరు టీకా ఉత్పత్తి చేసే కంపెనీల మాటలు కూడా నమ్మశక్యంగా లేవు. మొదట్లో వీళ్లే నీళ్ళ బాటిల్ ధరకు సమానంగా టీకా తీసుకొస్తామన్నారు. కానీ ఇప్పడు ఒక్కోడోసు 1400కు అమ్ముతున్నారు. దీనికి సర్వీస్ చార్జ్ అదనం కూడా. అందులోనూ రెండు వ్యాక్సీన్ల ధరలు కూడా చాలా వ్యత్యాసం. మొత్తం మీద ఫ్రీ వ్యాక్సీన్ అని ప్రకటించిన మోడీ.. ఇంత గందరగోళానికి ఎందుకు తావిచ్చినట్టు అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి