జగన్‌కు ఎప్పుడు ఏదో రకమైన సపోర్ట్ కావాల్సిందే అని చెప్పొచ్చు...అది ఏంటి ప్రజా మద్ధతు ఎక్కువ ఉన్న జగన్‌కు సపోర్ట్ ఎందుకని డౌట్ రావొచ్చు..డౌట్ రావడంలో తప్పు లేదు గాని..సపోర్ట్ కావాలి అనే దానిలో నిజముందని చెప్పాలి...ఎందుకంటే రాజకీయంగా ఆయనకు ప్రశాంత్ కిషోర్ లాంటి వారి సపోర్ట్ కావాలి..ఇక ప్రభుత్వాన్ని నడపటానికి సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుల సపోర్ట్ కావాలి.

గత ఎన్నికల ముందు పీకే వ్యూహాలతోనే జగన్ అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే...ఇక అధికారంలోకి వచ్చాక...ఎంతమంది సలహాదారులని నియమించుకుని ముందుకెళుతున్నారో అందరికీ తెలిసిందే. ఇక వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవడానికి పీకే టీంని రంగంలో దించారు...ఇప్పటికే పీకే టీం రంగంలోకి దిగి పనిచేస్తుంది...జగన్ పాలనపై, ఎమ్మెల్యేల పనితీరుపై పీకే టీం ప్రజానాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది.

ఇదే క్రమంలో పీకే టీంకు..పూర్తిగా జగన్ పాలనపై రివర్స్ పరిస్తితి కనిపిస్తోందని సమాచారం. జగన్ పాలన పట్ల ప్రజలు సంతృప్తిగా లేరనే తెలిసిందట. ఇప్పటికే పీకే టీం రాష్ట్రంలో పర్యటిస్తూ ప్రజానాడిని పట్టుకునే ప్రయత్నాలు చేస్తోందని, కానీ వారికి ప్రజానాడిలో తేడా కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. పైగా  పార్టీలో అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ బహిర్గతమవుతున్నాయి. అదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ అనూహ్యంగా పుంజుకుంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ సరికొత్త నిర్ణయంతో ముందుకు రావాలని చూస్తున్నారట. త్వరలోనే పార్టీ ప్లీనరీ సమావేశాన్ని పెట్టుకోవాలని భావిస్తున్నారట.

ప్లీనరీ సమావేశం ఎప్పుడో 2017లో జరిగింది...మళ్ళీ ఇప్పటివరకు సమావేశం జరగలేదు...అయితే రానున్న వైఎస్సార్ జయంతి నాడు ప్లీనరీ పెట్టుకోవాలని జగన్ చూస్తున్నారట..అప్పుడు పార్టీలోని అంతర్గత విభేదాలకు చెక్ పెట్టడం...ఇక ఎమ్మెల్యేలు పూర్తిగా ప్రజల్లో ఉండేలా చేయడం..అలాగే తాను కూడా ఇంకా జనాల్లోకి వెళ్ళే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారట. ప్రజల్లోకి వెళితేనే పార్టీపై ఉన్న నెగిటివ్ కాస్త పోతుందని భావిస్తున్నారట. చూడాలి మరి ప్లీనరీ తర్వాత వైసీపీలో ఎలాంటి మార్పులు వస్తాయో..!  

మరింత సమాచారం తెలుసుకోండి: