పవన్ కల్యాణ్ ప్లాన్ ను జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పక్కాగా అమలు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో పట్టు సాధించేందుకు ఏకంగా ఐదు రోజుల పాటు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో అసమర్థ పాలనతో అన్ని రంగాలు నాశనమయ్యాయని, పరిశ్రమలు రావడం లేదని, రహదారులు లేవని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అంటున్నారు.


అందుకే తాము ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి కార్యాచరణ సిద్ధం చేశామన్నారు. ఈ పోరాటంలో కార్యకర్తలు, నాయకులు, వీర మహిళల అభిప్రాయాలు, సలహాలు తీసుకునేందుకు., జిల్లాల పర్యటన చేపట్టామని నాదెండ్ల మనోహర్ అన్నారు. విజయనగరం ఉమ్మడి జిల్లా నుంచి ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని నాదెండ్ల మనోహర్ అన్నారు. ఐదు రోజుల పాటు ఉమ్మడి జిల్లా విజయనగరం జిల్లాలోని అన్ని నియోజవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహిస్తామన్నారు.


పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, భవిష్యత్తు ప్రణాళికపై చర్చించనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సమావేశాల్లో కష్టపడి పని చేసే వాలంటీర్లకు పెద్దపీట వేయనున్నట్లు నాదెండ్ల మనోహర్  తెలియచేశారు. విజయనగరం ఉమ్మడిజిల్లా లో చెరకు కర్మాగారాలు మూతపడ్డాయని, వ్యవసాయం సంక్షోభంలో ఉందని, ఇక్కడి వనరులను కొన్ని కుటుంబాలు దోచుకుంటున్నాయని నాదెండ్ల మనోహర్ విమర్శించారు.


ఈ జిల్లాలో జగనన్న కాలనీల పేరుతో భూసేకరణ, ఇళ్ల నిర్మాణంలో అవినీతికి పాల్పడ్డారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. 28 లక్షల ఇళ్లు నిర్మిస్తామని ఇప్పుడు 21 లక్షలు అంటున్నారని, మిగతా ఏడు లక్షలు ఏమయ్యాయని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. నిర్మాణ పనులు గుత్తేదారుకు ఇవ్వాలని లబ్ధిదారులను బెదిరిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. జనసేన నిజాయితీ పట్టుదల చూసి ముఖ్యమంత్రి సహనం కోల్పోయి రౌడీ సేనా అంటున్నారని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రజలకు మంచి చేయాలని పవన్ కళ్యాణ్ 2014 నుంచి ఎదురీదుతున్నారని మనోహర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: