ఏపీ విద్యావ్యవస్థలో సీఎం జగన్ కీలక మార్పులు తెస్తున్నారు. ఇప్పటికే నాడు నేడు పథకం ద్వారా పాఠశాలల రూపు రేఖలు మార్చేశారు. ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు ఫేజ్‌ –1లో పనులు పూర్తయిన స్కూళ్లలో అత్యాధునిక బోధన ఉపకరణాలు ఏర్పాటుకు కూడా జగన్ మంత్రిమండలి ఆమోదం తెలిపింది. దీని ద్వారా హైస్కూల్స్‌ పరిధిలో ప్రతి తరగతి గదిలో ఇంటరాక్టివ్‌ ప్లాట్‌ ప్యానెల్స్‌, పౌండేషన్, పౌండేషన్‌ ప్లస్‌ స్కూళ్లలో స్మార్ట్‌ టీవీ రూమ్స్‌ ఏర్పాటు చేస్తారు.


ఈ నిర్ణయం ద్వారా 6 వతరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతిగతిలో దాదాపు 15,694 స్కూళ్లలో 30,230 తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలు ఏర్పాటు అవుతాయి. దీనికోసం రూ.300 కోట్లు ఖర్చు చేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. 1వతరగతి నుంచి 5వతరగతి వరకు ప్రతి స్కూళ్లో ఒక టీవీ ఏర్పాటు చేస్తారు. పదివేల స్మార్ట్‌ టీవీల కోసం దాదాపు రూ.50 కోట్ల ఖర్చు చేస్తారు. దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన సింధియా, సెయింట్‌ జేవియర్స్, బాంబే స్కాటిస్, ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ వంటి అత్యున్నత ప్రమాణాలు గల విద్యా సంస్ధల్లోనే ఇప్పటి వరకూ ఇలాంటి సౌలభ్యం ఉండేది.


అలాగే ప్రభుత్వ స్కూళ్లలో 8వతరగతి విద్యార్ధులకు ఇరవైనాలుగు గంటలపాటు ఉపయోగపడే విధంగా ట్యాబులు, ఇ–కంటెంట్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని 21 డిసెంబరున జగన్ లాంఛనంగా ప్రారంభిస్తారు. దీని ద్వారా 4.6లక్షల మంది 8వతరగతి చదువుతున్న విద్యార్ధులతో పాటు 60 వేల మంది 8వతరగతి బోధించే ఉపాధ్యాయులకు ఉచితంగా శామ్‌సంగ్‌ ట్యాబులు పంపిణీ చేస్తారు.


వీటిలో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ లేకపోయినా, ట్యాబును ఇంటిలో కూడా వినియోగించుకునేలా, ఆఫ్‌లైన్‌లో కూడా కంటెంట్‌ అందుబాటులో ఉంచుతారు. సెక్యూర్‌ డిజిటల్‌ కార్డుతో బైజూస్‌ సంస్ధ కంటెంట్‌తో ట్యాబులు అందజేయనుంది. దీనికోసం రూ.668 కోట్లు ఖర్చు చేస్తారు. దీనితో పాటు రూ.778 కోట్ల విలువైన బైజూస్‌ కంటెంట్‌ ఉచితంగా విద్యార్థులకు లభించనుంది. మూడేళ్ల వారెంటీతో ఈ ట్యాబులు పంపిణీ చేస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: