వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు.. కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇదీ మన న్యాయ సిద్ధాంతం. అయితే.. ఉత్తరప్రదేశ్ లో యోగి ప్రభుత్వం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. యూపీలో రౌడీషీటర్లు, గ్యాంగ్ లీడర్ల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఎక్కడ ఏ విధమైన రౌడీయిజం, అరాచకం చేసినా వారి ఇళ్లను యోగి ప్రభుత్వం కూల్చేస్తుంది. వారి ఆస్తులను మొత్తం ప్రభుత్వం తీసేసుకుంటుంది.


ఎవరైనా నేరస్థులు జనాల సొమ్ము దోచుకుంటే వారిని వెంటనే అరెస్టు చేస్తున్నారు. ఉమేష్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కొంతమంది దుండగులు నరికి చంపారు. దీనికి నిరసనగా చిన్న చిన్న ఇళ్లను కూల్చడం కాదు. మా పార్టీకి సంబంధించిన వ్యక్తిని చంపిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని సమాజ్ వాదీ పార్టీ కోరింది.


దీనికి యోగి 24 గంటల టైం ఇవ్వండి మేమేంటో చూపిస్తామని అన్నారు. తీరా చూస్తే రెండో రోజు కనిపెట్టినా విషయం ఏమిటంటే సీసీ కెమెరాల్లో మొత్తం రికార్డు అయింది. అందులో ఆయన్ని చంపింది సొంత పార్టీ సమాజ్ వాదీ పార్టీ నాయకులే అని తేలింది. దీంతో వారిని చితకబాదారు. ఒక వ్యక్తిని ఎన్ కౌంటర్ చేశారు. వారి ఇళ్లను కూల్చేశారు. దీంతో నేరం చేయాలంటేనే భయపడే స్థితికి తీసుకొచ్చారు.


యూపీలో చేస్తున్న విధంగానే తెలంగాణలోనూ బీజేపీ అధికారంలోకి వస్తే చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అంటున్నారు. ఆడవాళ్లను వేధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారికి సంబంధించిన ఇళ్లను కూల్చేస్తామన్నారు. కానీ యూపీలో చేసినంత ఈజీ ఇక్కడ కాదు. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి కోర్టుకు వెళ్లడం అలవాటుగా మారింది. కోర్టు నుంచి స్టేలు తెచ్చుకోవడం లేదా బెయిల్ పై బయటకు రావడం వెన్నతో పెట్టిన విద్య. డబ్బులిస్తే చాలు ఎలాంటి పనైనా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి యూపీ చేసినట్లు చేస్తానంటే తెలంగాణలో కుదరకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: