అదే తెలుగుదేశం పార్టీ జనసేన అయితే బోర్డులు పెట్టుకుని, బ్యానర్లు పెట్టుకొని కలిసి మరీ చేసిన సందర్భం అయితే ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ మొత్తానికి సోము వీర్రాజు కారణమని చెప్తూ లేకపోతే రాష్ట్ర నాయకుల్ని మార్చమని కోరుతున్నారు అన్నటువంటిది ప్రధానంగా వినపడుతుంది. మురళీధరన్ ని కలిసిన అసలు అంశం అది.
ఏంటంటే టిడిపి తో పొత్తుకు సంబంధించి సోము వీర్రాజు అడ్డం అన్నటువంటి ఫీలింగ్ ప్రధానంగా ఉంది. సోము వీర్రాజుని కాకుండా ఇంకెవరినైనా పెడితే ఆంధ్రప్రదేశ్ లో సొంతంగా ఎదగడం కష్టమని అధిష్టానం దగ్గరికి వెళ్లి బిజెపి-టిడిపి పొత్తు బెటర్ అని చెప్పి ఒప్పించాలి. అలా అంగీకరిస్తారా అంటే అది అధిష్టానానికి ఇష్టం లేదు. కానీ రాష్ట్ర నాయకత్వమే చెప్తే సరే పోండి అని వదిలిపెడితే చాలు మిగతా కథంతా నడుపుకోవడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నారు.
టీడీపీతో పొత్తు లేకపోతే జనసేన-బిజెపి పొత్తు గురించి మాట్లాడారా. అసలు రాష్ట్ర నాయకులు పనికిరారని ధోరణిలోనే ఉన్నారు. అప్పటి చంద్రబాబు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్ర నాయకులు మాకు లెక్క కాదు, కేంద్ర నాయకులే మాకు లెక్క అన్నట్టుగా. పవన్ కళ్యాణ్ మాటని కాదనే సీను కూడా బిజెపి దగ్గర లేదు. అయినా కూడా జరుగుతున్న వేళ నేను వచ్చింది రాజకీయాల గురించి కాదు రాష్ట్రం కోసమే అని చెప్పేందుకు గజేంద్ర సింగ్ షెకావత్ ని కలిసి పోలవరానికి సంబంధించి వినతిపత్రం కూడా ఇచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి