
అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతున్నారని అన్ని మీడియా ఛానళ్లు ఊదరగొట్టాయి. రాత్రి ఒంటిగంట వరకు పోలింగ్ జరిగింది మహిళలు పెద్ద ఎత్తున పోలింగ్ కు హాజరయ్యారు. ఉదయం ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కాగానే పోస్టల్ బ్యాలెట్లు కూడా టీడీపీకి అనుకూలంగా వచ్చాయి. ఇక ఏముంది కచ్చితంగా టీడీపీ విజయం సాధిస్తుందనుకున్నారు. కానీ మొదటి రౌండ్ ముగిసే సరికి వైసీపీ ఆధిక్యం లో ఉండడం టీడీపీ 22 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో గెలుపు పై సందేహాలు నెలకొన్నాయి.
మూడు నాలుగు రౌండ్లు ముగిసే సరికి 150 స్థానాలతో ఆదిక్యంలోకి దూసుకెళ్లిపోయింది. దీంతో వైసీపీ నాయకులు సంబరాలు చేసుకోవడం టీడీపీ నిరాశలో కూరుకుపోవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ సైతం పవన్ కళ్యాణ్ రెండు స్థానాలు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోవడంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. చివరి ఫలితం నెల్లూరు అసెంబ్లీ స్థానం నారాయణ, అనిల్ యాదవ్ ల మధ్య పోటాపోటీ నెలకొంది అందులో అనిల్ యాదవ్ కూడా గెలవడం వైసీపీ శ్రేణులను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది.