ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ కు మద్దతు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా మీడియా సపోర్టు ఎక్కువ అవుతోంది. మీడియా యాజమాన్యానికి కాంగ్రెస్ గతంలో ఎక్కువ సపోర్టు ఇవ్వడం, మీడియాకు అనుకూలంగా ప్రవర్తించడం లాంటివి చేయడంతో ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు కాంగ్రెస్ పై ఎక్కువ అభిమానం కురిపిస్తున్నాయి.


మరో వైపు బీజేపీ మీడియాకు సరైన సపోర్టు ఇవ్వకపోవడం, బీజేపీ భావజాలం ఆయా మీడియా సంస్థలకు కూడా నచ్చకపోవడం లాంటి విషయాలు ఇక్కడ ప్రధానాంశంగా ఉన్నాయి. కాంగ్రెస్ ఐడియాలజీని మీడియా బాగా ప్రొజెక్టు చేస్తూ వచ్చింది. స్మృతి ఇరానీ అమేథీ నియోజకవర్గంలో రాహుల్ గాంధీపై గెలిచారు. కానీ రాహుల్ గాంధీ ఐడియాలజీ ప్రకారం అక్కడ మీడియా పని చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఉత్తరప్రదేశ్ లో అమేథీ, రాయ్ బరేలీ రెండు చోట్ల నుంచి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎంపీలుగా పోటీ చేసేవారు. సోనియా గెలిచినా చివరి సారి జరిగిన సాధారణ ఎన్నికల్లో రాహుల్ గాంధీ స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. దీంతో ఆమె గెలిచి బీజేపీలో కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎంపీగా గెలిచిన సమయంలో ఎన్ని సార్లు వారి నియోజకవర్గంలో పర్యటించారు. దాదాపు అయిదేళ్లలో ఒక పది పన్నెండు సార్ల కంటే ఎక్కువ పర్యటించి ఉండరు.


కానీ బీజేపీ ఎంపీ కేంద్ర మంత్రి అయినా స్మృతి ఇరానీ పై కాంగ్రెస్ దాని అనుకూల మీడియా నెగిటివ్ ప్రచారం చేయడం మొదలెట్టింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కనబడుట లేదని గోడలపై రాతలు రాస్తున్నారు. కనిపించిన చోటల్లా పోస్టర్లు అతికిస్తున్నారు. దీన్ని కాంగ్రెస్ అనుకూల నేషనల్ మీడియా దీన్ని తెగ వైరల్ చేేసేస్తోంది. దీని వల్ల బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మళ్లీ అమేథీలో ఆధిపత్య పోరు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఏడాది ముందుగానే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడంతో రాజకీయం హీటెక్కిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: