చంద్రబాబు హయంలోనే లిక్కర్ కు సంబంధించి చాలా కంపెనీలకు, బ్రాండ్లకు అనుమతులు ఇచ్చేసారని ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు హయాంలో అనుమతులు ఇచ్చారు బాగానే ఉంది. కానీ జగన్ హయాంలోకి వచ్చాక మరి వాటిని వీళ్ళు నిషేధించాలి కదా అని అడుగుతున్నారు కొంత మంది. ప్రతిపక్షాలు కనుక కోర్టుకి వెళితే ఆ మేరకు ప్రతిపక్షాలు ఇలా అంటున్నాయి కాబట్టి రద్దు చేస్తున్నామని చెప్పే అధికారం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది.
అలాగే ఫ్రెష్ టెండర్లను పిలుస్తున్నాం, వాళ్లను కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పవచ్చు. పాత బ్రాండ్లను రద్దు చేయవచ్చు. అలా చేస్తే కాదనే వాళ్లు కూడా ఎవరూ ఉండరు. అలా చేయకుండా నాలుగున్నర ఏళ్ల తర్వాత కేసులు పెడుతున్నారు. ఇసుక విషయంలో ఇప్పుడున్న ప్రభుత్వం చాలా విధానాలు తీసుకు వచ్చినా అవన్నీ ఫెయిల్ అయ్యాయి. అక్కడకే వచ్చి ట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చుకోవాలని, అలాగే డంపింగ్ యార్డులు పెడుతున్నామని రక రకాల విధానాలను తీసుకువచ్చింది.
అయితే ఈ విధానాలన్నీ ఫెయిల్ అయ్యాయి. జనాలు కూడా ఈ ఇసుక ధరలతో ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కరోనా టైంలో ఈ ఇబ్బందులు కొంత కవర్ అయ్యాయి. ఆ తర్వాత జెపి సంస్థ ఇసుక వ్యవహారాలను నడిపించింది. అయితే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కావాలని ఇరికిస్తున్నారనే వాదన ఎక్కువైంది. దాంతో చంద్రబాబు నాయుడుకి సింపతి పెరిగి అది జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయ్యే పరిస్థితి ఏర్పడింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి