తెలుగు దేశం ప్రభుత్వం ఒక ఇంటికి ఒక కనెక్షన్ పేరుతో కేబుల్, టీవీ, ఇంటర్ నెట్, ఫోన్ సదుపాయం కల్పించేందుకు 2015లో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును తీసుకువచ్చింది. దీనికి రూ.149 కే కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించింది.  ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ఈ ప్రాజెక్టుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.


అయితే ఈ ప్రాజెక్టు పేరుతో చంద్రబాబు, నారా లోకేశ్ లు భారీ అవినీతికి పాల్పడినట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో రెండువేల కోట్ల వరకు అవినీతి జరిగిందని చెబుతున్నారు. హరిప్రసాద్ అనే వ్యక్తికి లబ్ధి చేకూర్చేందుకు అతనిపై ఉన్న బ్యాన్ ఎత్తేసి మరీ టెండర్ గడువును పొడగించి.. ఆయనకు ఆ ప్రాజెక్టును అప్పగించారు అనేది ప్రధాన అభియోగం. దానిపై కేసు నమోదు చేయగా.. దీనికి ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకోగా ప్రస్తుతం విచారణ సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. తాజాగా చంద్రబాబు బయటకు వచ్చిన నేపథ్యంలో ఈ కేసు ఆగిపోతుందని అంతా భావించారు.


అయితే ఈ కేసులో కీలక పరిణామ చోటు చేసుకుంది. రూ.114 కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై నిందితులకు చెందిన ఆస్తులను అటాచ్ చేస్తూ ఏపీ హోం శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో నిందితుల ఆస్తులను అటాచ్ చేస్తూ జీవో 180ని హోం శాఖ కార్యదర్శి హరీశ్ గుప్తా జారీ చేశారు.


ఈ క్రమంలో కేసుకు సంబంధించిన చంద్రబాబు సన్నిహితుల ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని ప్రతిపాదలను పంపగా హోం శాఖ ఆమోదం తెలిపింది. దీంతో అనుమతి కోసం సీఐడీ ఏసీబీ  కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. అటాచ్ చేయనున్న ఆస్తుల్లో గుంటూరులోని ఇంటిస్థలం, విశాఖపట్నంలో ఓ ప్లాట్, హైదరాబాద్ లో నాలుగు ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమి ఉన్నట్లు తెలుస్తోంది. మరేం జరగుతుందో చూద్దాం.


మరింత సమాచారం తెలుసుకోండి: