దేశ వ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నా తెలుగు ప్రజల చూపు మొత్తం ఏపీపైనే ఉంది.  రాబోయే ఐదేళ్లు దేశాన్ని పాలిచేవారితో పాటు రాష్ట్రాన్ని నడిపించే నాయకుని అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి కాబట్టి.  ఇలా ఒకేసారి రెండు ఎన్నికలు జరుగుతుండటంతో ఏపీలో ఎండలు కంటే పొలిటికల్ హీట్ ఎక్కువగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో అంచనా వేయడం కూడా కష్టంగానే మారింది.

 
ఈ ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని.. వైసీపీ నాయకులు ప్రజా ధనాన్ని ఇష్టం వచ్చినట్లు దోచుకున్నారని ప్రతిపక్ష కూటమి ఆరోపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఏ రంగంలోనూ వృద్ధి సాధించలేదని ఆరోపిస్తున్నారు. మరి నిజంగానే వైసీపీ ఈ సర్కారు రాష్ట్రాన్ని ఉద్దరించింది ఏమీ లేదా ప్రతిపక్షాలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నాయా అనేది ప్రజలకు అర్థం కావడం లేదు.


ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రాతో పోల్చుకుంటే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలను ఇరు ప్రభుత్వాలు బాగానే అమలు చేస్తున్నాయి. అయితే రెండింటితో పోల్చినప్పుడు ఏపీ కన్నా తెలంగాణలో అభివృద్ధి ఎక్కువ  జరిగిందని.. బంగారు తెలంగాణ కల సాకారం అయిందని అటు మీడియాతో పాటు ఏపీ ప్రతిపక్ష నేతలు సైతం పేర్కొన్నారు. గతుకుల రోడ్లు వస్తే ఏపీ అంటూ ఎద్దేవా చూశారు. సీన్ కట్ చేస్తే 2023 డిసెంబరులో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  బీఆర్ఎస్ పార్టీని 105 స్థానాల నుంచి 39 సీట్లకు పరిమితం చేశారు.


ఇంతలా అభివృద్ధి చేస్తే ఎందుకు ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అయితే తెలంగాణ మాదిరి ఏపీలో అభివృద్ధి జరగలేదని.. అందుకే వైసీపీకి ఓటేయ్యొదని ప్రతిపక్షాలు పేర్కొంటున్నాయి.  అంటే అక్కడ అభివృద్ధి జరగక ప్రజలు బీఆర్ఎస్ కు ఓటేయ్యలేదా అనేది ఇక్కడ అర్థం కానీ అంశం. మరి ఇక్కడి అభివృద్ధి జరిగింది అని విశ్వసిస్తారా, లేదా తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: