
కానీ.. టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మాత్రం అధికారుల మాటను నాయకులు, నాయకులు చెప్పినట్టు అధికారులు వినిపించుకోవడం లేదు. అంతెందుకు మంత్రులు చెప్పినా అధికారులు మాట వినడం లేదని.. నాలుగు రోజుల కిందట సాక్షాత్తూ.. మంత్రి అనిత పేర్కొన్నారు. విజయనగరం అధికారు లకు ఆమె క్లాస్ తీసుకున్నారు. ఇక, ఇప్పుడు ఏకంగా.. పార్వతీపురం ఎమ్మెల్యే వ్యవహారం రోడ్డెక్కింది. ఏకంగా ఎమ్మెల్యేపై ఎంఆర్‌వో పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశం అయింది.
వాస్తవానికి ఎమ్మార్వోకు ఇబ్బంది కలిగితే.. ప్రొటోకాల్ ప్రకారం.. కలెక్టర్‌ను ఆశ్రయించాలి. ఎందుకంటే జిల్లా పూర్తిస్థాయి రెవెన్యూ అధికారి కలెక్టరే కాబట్టి.. ఆయన చేతిలోనే అందరూ ఉంటారు. కానీ, ఇక్కడ రాజకీయం భిన్నంగా సాగింది. నేరుగా పోలీసులకు కంప్లయింట్ చేయడం ద్వారా ఎమ్మార్వో రోడ్డెక్కారు. ఇది అసాధారణ విషయం. తనను దూషించారని.. బండ బూతులు తిట్టారని ఆమె చెప్పుకొచ్చారు. ఇక, ఇదేసమయంలో ఎమ్మెల్యే కూడా వెనక్కి తగ్గలేదు.
రైతుల నుంచి అధికారి లంచాలు తీసుకున్నారని 10 లక్షల చొప్పున ఆమె డిమాండ్ చేశారని ఎమ్మెల్యే చెప్పారు. ఈ రెండు పరిణామాలు కూడా.. సర్కారును రోడ్డున పడేశాయి. ప్రభుత్వంలో అవినీతి జరుగుతోం దన్న విషయాన్ని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్న ఘట్టం తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఈ విషయం నిజమేనని స్పష్టం చేస్తోంది. సహజంగా నియోజకవర్గాల్లో అధికారులకు-ఎమ్మెల్యేలకు పడడం లేదు. ఇప్పుడు ఈ వివాదంతో మరింతగా పరిస్థితి దిగజారిందన్నది స్పష్టమవుతోంది. సో.. ఇలాంటివి రాకుండా ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు పరిశీలకులు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు