ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో పొత్తులో చాలా సీట్లలో టీడీపీ త్యాగం చేసింది. మిత్రపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్‌చార్జ్‌లు పార్టీ కేడర్‌ను సరిగా పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి నియోజకవర్గాల్లో సరి కొత్త నాయకత్వంను తెరమీదకు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఏలూరు జిల్లాలోని ఎస్టీ రిజర్వ్‌డ్ నియోజకవర్గంగా ఉన్న పోలవరం పేరు జాతీయ స్థాయిలో ఎప్పుడూ హైలెట్స్‌లో ఉంటుంది. ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు ఈ నియోజకవర్గంలోనే ఉంది. అటు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెట్టాలనుకున్న ఆయుధ డిపో కర్మాగారం కూడా ఇదే నియోజకవర్గంలో ఉంది. తెలంగాణ - ఏపీ రాష్ట్రాలకు ఈ నియోజకవర్గం మూడు వైపులా వారధిలా విస్తరించి ఉంది. ఈ క్రమంలోనే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే ఉన్న నేపథ్యంలో పార్టీని పటిష్టం చేసుకోవడం.. కేడర్‌ను కాపాడుకోవడం టీడీపీ ముందున్న బిగ్ ఆజ్జెక్ట్.
మహిళా నాయకత్వం దిశగా ఆలోచన..?
పోలవరం నియోజకవర్గ టీడీపీలో గతంలో మహిళా నాయకత్వాన్ని సైతం టీడీపీ ఎంకరేజ్ చేసిన సందర్భం ఉంది. 2004 ఎన్నికల్లో సున్నం బుజ్జి ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు పార్టీ యువనేత నారా లోకేష్ టీంలో యాక్టివ్‌గా ఉంటూ ఇటీవలే ప్రతిష్టాత్మకమైన శాప్ డైరెక్టర్‌గా ఎంపికైన కొవ్వాసు జగదీశ్వరికి నియోజకవర్గ పార్టీ పగ్గాలు అప్పగిస్తారన్న చర్చలు గత పది రోజులుగా గట్టిగా వినిపిస్తున్నాయి. పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ ఈ విషయంపై పార్టీ ముఖ్య నేతల మధ్య చర్చకు వస్తోంది. మెయిన్ మీడియాలోనూ ఇదే విషయం హైలెట్ అవుతోంది. చంద్రబాబుతో పాటు యువనేత నారా లోకేష్ నాయకత్వంలో పని చేయాలన్న సంకల్పంతో జగదీశ్వరి పంచాయతీ రాజ్ ఉద్యోగాన్ని వదులకుని పార్టీ కార్యక్రమాల్లో బాగా యాక్టివ్‌గా పనిచేశారు. నారా లోకేష్ యువగళం కోసం జగదీశ్వరి దంపతులు ఇద్దరూ పడిన కష్టమే ఈ రోజు ఆమెను శాప్ డైరెక్టర్‌ను చేసింది.
50 % మహిళా రిజర్వేషన్ అమలైతే సీటు పక్కా...
మహిళలకు చట్ట సభల్లో కూడా 50 % రిజర్వేషన్ అమల్లోకి వస్తే కొవ్వాసుకు పోలవరం మరింత బలమైన వేదిక కానుందన్న అంచనాలు ఉన్నాయి. ఇటు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉంటూ కేడర్‌ను సమన్వయం చేసే నాయకుడే కరువయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో లోకేష్.. జగదీశ్వరికి అవకాశం ఇవ్వాలన్న నిర్ణయంతో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో గట్టిగా చర్చ నడుస్తోంది. పార్టీకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే లేరు.. కేడర్‌ను పట్టించుకోకపోవడంతోనే రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల్లో నియోజకవర్గానికి బాగా అన్యాయం జరిగిందన్న ఆవేదన టీడీపీ కేడర్‌లో గట్టిగా వినిపిస్తోంది.
స్థానికంగా పార్టీ కేడర్‌కు అందుబాటులో ఉండే వారికే పార్టీ నియోజకవర్గాలు పగ్గాలు ఇస్తేనే కేడర్ ఇక్కడ ధీమాతో ఉంటుందని.. లేనిపక్షంలో పార్టీ కేడర్ చిన్నాభిన్నం అయ్యి.. ప్రతిపక్ష వైసీపీ బలంగా పుంజుకుంటుందన్న ఆందోళన పార్టీ నాయకుల్లో కనిపిస్తోంది. వీరి మధ్య ఇదే విషయం అంతర్గత చర్చల్లోనూ వినిపిస్తోంది. ఇదే టైంలో నియోజకవర్గ నాయకత్వ మార్పు అంశం ఇటు స్థానికంగాను, అటు కేంద్ర కార్యాలయంలోనూ చర్చకు వస్తుండడంతో జగదీశ్వరికి అవకాశం వస్తుందంటున్నారు. నారా లోకేష్‌కు నమ్మకస్తురాలు కావడం... లోకేష్ కులం, ప్రాంతం, ఎమోషనల్ లాంటి అంశాల కంటే కష్టపడిన వారినే గుర్తించి అవకాశాలు ఇస్తారన్నది నిజం. పార్టీ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, నియోజకవర్గంలో పార్టీ కేడర్ ను కాపాడుకోవడం కోసం అయినా పోలవరం నియోజకవర్గంలో సరికొత్త నాయకత్వానికి అధినాయకత్వం బాధ్యతలు అప్పగిస్తుందా ? జగదీశ్వరి లక్ ఎలా ఉంటుందన్నది చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి