ఒక్క ఏటికే చీర ఇచ్చి సారే పెట్టినట్టు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.ప్రభుత్వం రెండు చీరలు ఇస్తామని చెప్పి ఒకటే ఇచ్చిందని హరీష్ రావు ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం కింద నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. రెండేళ్లలో అరవై వేల రూపాయలు ఇచ్చి మహిళలను మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
పట్టణ ప్రాంతాల్లో చీరలు లేవని వడ్డీలేని రుణాలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు లేని చోట మహిళలకు ఏమీ ఇవ్వడం లేదని ఆరోపించారు. మహిళా సంఘాలు ఇరవై ఐదు వేల కోట్ల రుణాలు తీసుకుంటే కేవలం ఐదు వేల కోట్లకు మాత్రమే వడ్డీ మినహాయింపు ఇస్తున్నారని లెక్క చూపించారు.
ఇరవై పైసలు ఇచ్చి ఎనభై పైసలు ఎగనాంపేస్తున్నారని ధ్వజమెత్తారు.సిద్దిపేట జిల్లా మహిళా సంఘాలకు ఒక్క ఆర్టీసీ బస్సు కూడా ఇవ్వలేదని హరీష్ రావు గుర్తు చేశారు. వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తామని చెప్పి రెండేళ్లు గడుస్తున్నా ఒక్క మెగావాట్ కూడా పెట్టలేదని విమర్శించారు.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి