సంగారెడ్డి రాజకీయ వర్గాల్లో ఊహాగానాలకు తెరపడింది. ప్రస్తుత ఎమ్మెల్యే జగ్గారెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేయబోనని స్పష్టం చేశారు. తన స్థానంలో భార్య నిర్మలను అభ్యర్థిగా నిలబెడతామని ఆయన ప్రకటించారు. ఈ నిర్ణయం పార్టీ హైకమాండ్ ఆమోదంతోనే తీసుకున్నట్టు సమాచారం. రాహుల్ గాంధీ సూచనలు ఉన్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక మేరకు తాను వెనక్కి తగ్గుతున్నానని జగ్గారెడ్డి వెల్లడించారు.

ఈ ప్రకటనతో సంగారెడ్డి నియోజకవర్గంలో కొత్త రాజకీయ రసవత్తర పరిస్థితి నెలకొంది.జగ్గారెడ్డి ఈ నిర్ణయం వెనుక పార్టీ లోపలి వ్యూహం ఉందని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిర్మల పేరు ప్రతిపాదించడం ద్వారా జగ్గారెడ్డి కుటుంబ పట్టు కొనసాగుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో తాను నేరుగా పోటీ చేయకపోవడం ద్వారా పార్టీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.

రాహుల్ గాంధీ సూచనలను ఛాలెంజ్ చేయడం కుదరదని జగ్గారెడ్డి స్పష్టంగా చెప్పడం గమనార్హం.ప్రస్తుతం సర్పంచ్ ఎన్నికలపైనే జగ్గారెడ్డి దృష్టి పెట్టారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సత్తా చాటాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లో బలమైన అభ్యర్థులను గెలిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే అద01సెంబ్లీ ఎన్నికలకు బూస్ట్ ఇస్తుందని ఆయన భావిస్తున్నారు.

జగ్గారెడ్డి నిర్ణయం సంగారెడ్డి రాజకీయ చిత్రణను మార్చేసింది. నిర్మల అభ్యర్థిత్వం ఆమోదయోగ్యమైతే కాంగ్రెస్ బలం మరింత పెరుగుతుందని పార్టీ నాయకులు ఆశిస్తున్నారు. రెడ్డి వెనక్కి తగ్గడం ద్వారా పార్టీ ఐక్యత కోసం త్యాగం చేసినట్టు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి సూచనలకు కట్టుబడి ఉండటం ఆయనలోని క్రమశిక్షణను చూపుతోంది.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..
ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: