తెలంగాణ బీజేపీలో అంతర్గత విభేధాలు తీవ్ర స్థాయికి చేరాయి. రాష్ట్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరిగినా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు అధ్యక్షతన నిర్వహించిన ఈ కీలక సమావేశానికి ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరు కాలేదు. శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రమే హాజరయ్యారు. రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ సహా కొందరు రాష్ట్ర పదాధికారులు మాత్రమే సమావేశంలో పాల్గొన్నారు.

ఎన్నికల వ్యూహాలు రూపొందించే ఈ సమావేశానికి పార్టీ పెద్దలు దూరంగా ఉండటం రాష్ట్ర నాయకత్వానికి పెద్ద ఎదురుదెబ్బగా మారింది.స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు అభ్యర్థుల ఎంపికలపై చర్చించేందుకు రాష్ట్ర పార్టీ అధిష్ఠానం ప్రత్యేకంగా ఆహ్వానం పంపినా ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున గైర్హాజరయ్యారు. గతంలో పోటీ చేసిన అభ్యర్థులు కూడా సమావేశానికి రాలేదు.

ఈ పరిస్థితి రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు ఆశ్చర్యం కలిగించింది. పార్టీలో ఆయన పట్ల నమ్మకం తగ్గుతోందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాత్రమే హాజరు కావడం రాష్ట్ర నాయకత్వంలో ఒంటరితనం స్పష్టం చేసింది. పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్ర అధ్యక్షుడిని లెక్క చేయడం లేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ గైర్హాజరీ పార్టీకి పెద్ద నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు బహిరంగంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు పట్ల పెద్ద నాయకులు దూరం పాటిస్తుండటం పార్టీ ఐక్యతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ పరిణామాలు రాబోయే ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించకపోతే విభేధాలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.

వాట్సాప్ నెంబ‌ర్‌ 94905 20108 కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..
ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP