దీనితో సేవా కార్యక్రమాలు మరింత వేగం పుంజుకునే అవకాశం ఏర్పడింది.చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దేశవ్యాప్తంగా బ్లడ్ బ్యాంకులు, ఐ బ్యాంకులు నిర్వహిస్తున్నారు. పేద వైద్యం, ఆరోగ్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిరంతరం నడుస్తున్నాయి. ఈ కార్యక్రమాలకు భారీ నిధులు అవసరమవుతుండటంతో విదేశీ దాతల సహాయం కీలకమని ట్రస్ట్ అధికారులు భావిస్తున్నారు. కొత్త అనుమతితో ఇప్పటి వరకు సొంత ఆదాయంపై ఆధారపడిన సేవలు మరింత విస్తృతంగా చేపట్టే మార్గం సుగమమైంది.
విదేశీ విరాళాల నియంత్రణ చట్టం 2010 ప్రకారం ప్రతి స్వచ్ఛంద సంస్థ తప్పనిసరిగా ఎఫ్‌సిఆర్‌ఏ రిజిస్ట్రేషన్ పొందాలి. గత కొన్నేళ్లుగా నిబంధనలు కఠినతరం చేసిన కేంద్రం ఇప్పుడు చిరంజీవి ట్రస్ట్‌కు మినహాయింపు లాంటి సానుకూల నిర్ణయం తీసుకుంది. ట్రస్ట్ దరఖాస్తుకు కేంద్ర హోం మంత్రి స్థాయిలోనే ఆమోద ముద్ర పడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఈ నిర్ణయం వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిఫారసులు పనిచేశాయని తెలుస్తోంది. ప్రధాని మోడీతో సత్సంబంధాలు కలిగిన ఇద్దరు నేతలు చిరంజీవి సేవా కార్యక్రమాలను కేంద్రానికి వివరించి ఈ అనుమతి సాధ్యం చేశారని సమాచారం. దీనితో చిరంజీవి ట్రస్ట్ సేవలు ఇంకా బలోపేతం కానున్నాయి.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి