నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్‌. భారత అణుశక్తి విభాగానికి చెందిన హెవీ వాటర్ బోర్డు-HWB ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 185 ఖాళీలున్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.  స్టైపెండరీ ట్రైనీ, టెక్నికల్ ఆఫీసర్ పోస్టులున్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.  రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. https://hwb.mahaonline.gov.in/ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. దరఖాస్తుకు 2020 జనవరి 31 చివరి తేదీ.

 

ఇక ఖాళీల వివరాలు చూస్తే.. మొత్తం ఖాళీలు- 185. అందులో టెక్నికల్ ఆఫీసర్ డీ- 28. దీనిలో కెమికల్- 21, మెకానికల్- 3, ఇన్‌స్ట్రుమెంటేషన్- 2సివిల్- 2 పోస్టుల ఉన్నాయి. అలాగే స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 పోస్టులు- 65 ఉన్నాయి. వీటిలో కెమికల్- 43, మెకానికల్- 1, ఎలక్ట్రికల్- 7, ఇన్‌స్ట్రుమెంటేషన్- 9,
కెమిస్ట్రీ (ల్యాబరేటరీ)- 5 పోస్టులు ఉన్నాయి. మ‌రియు స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 పోస్టులు- 92 ఉన్నాయి. ఇందులో ప్రాసెస్ / ప్లాంట్ ఆపరేటర్- 56, కెమిస్ట్రీ (ల్యాబరేటరీ)- 2, ఎలక్ట్రికల్- 4, మెకానికల్ (ఫిట్టర్)- 1, మెకానికల్ (మోటార్ వెహికిల్)- 1, వెల్డర్- 8, రిగ్గర్- 8, టర్నర్- 2, ప్లంబర్- 3, మేసన్- 2, కార్పెంటర్- 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 

 

ఇక  విద్యార్హత- టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 పోస్టుకు సంబంధిత విభాగంలో డిప్లొమా 60 శాతం మార్కులతో పాస్ కావాలి. స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 పోస్టుకు ఇంటర్ 60 శాతం మార్కులతో పాస్ కావాలి. దరఖాస్తు ఫీజు- రూ.100 చ‌ల్లించాలి. అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జనవరి 11 కాగా, దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 31.

మరింత సమాచారం తెలుసుకోండి: