సాధారణంగా ఇంటర్ మార్కులను బేస్ చేసుకొని ఎంసెట్ కౌన్సెలింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే.. అయితే ఎంసెట్ ర్యాంకుల విషయం లో తప్పిదాలు వెలువడటంతో మరోసారి ఈ విషయం పై కీలక నిర్ణయం తీసుకున్నారు.రాష్ట్ర ఉన్నత విద్యామండలి సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ఎంసెట్‌లో ఇంటర్‌ మార్కులకు ఉన్న 25 శాతం వెయిటేజీని ఎత్తివేయాలని ప్రభుత్వానికి నివేదికను పంపిస్తామని తెలంగాణ రాష్ట్ర విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు.



ఇటీవల తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ, ఏపీ ఇంటర్‌ బోర్డుల నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థుల తో పాటు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌సీ, సార్వత్రిక విద్యాపీఠం, నేషనల్‌ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ తదితర విద్యా సంస్థల్లో ఇంటర్‌ ఉత్తీర్ణులైన వారు ఎంసెట్‌కు హాజరవుతున్నారు.. అయితే ఆ విద్యా సంస్థలకు సంబంధించిన బోర్డు వాళ్ళు మార్కుల లిస్ట్ ను పంపక పోవడం వల్ల ఈ సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.



అయితే ఇలాంటి జాప్యం జరగకుండా ఉండాలంటే  ఇంటర్ వెయిటేజీ తొలగిస్తే ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉంటాయని అన్నారు. ఈ అంశం పై ప్రభుత్వానికి జేఎన్‌టీయూహెచ్‌తో కలిపి ఉన్నత విద్యామండలి ప్రతిపాదన పంపుతుందన్నారు. జేఈఈ మెయిన్‌ లో గతంలో ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉండేదని.. పలు బోర్డులతో సమస్య వస్తోందని భావించి దాన్ని 2015లోనే తొలగించారని మరోసారి గుర్తు చేశారు. కౌన్సిలింగ్ లేటు అవ్వడం తో తరగతులు కూడా లేట్ అవుతున్నాయని వెల్లడించారు. ఇలాంటి చిన్న వాటి వల్ల విద్యార్థుల తరగతులు లేటు అవుతున్నాయని అన్నారు. ఈ విషయం పై ప్రభుత్వం మరొకసారి సమగ్ర విచారణ జరిపి ఒక నిర్ణయానికి రావాలని కోరారు.. మరి ఈ విషయం పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలని విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: