పసిడి ప్రియులకు శుభవార్త.. త్వరలో ఐదు వేలకు పడిపోనున్న బంగారం ధర..కొత్త ఏడాదిలో బంగారం ధరలు ఏకంగా ఐదు వేలకు పడిపోతాయని అంటున్నారు.కొత్త ఏడాది కల్లా కరోనా వ్యాక్సిన్ మార్కెట్లోకి వస్తే ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.45,000 స్థాయికి పడిపోవచ్చని ఎస్కార్ట్ సెక్యూరిటీ రీసెర్చ్ హెడ్ అసిఫ్ ఇక్బాల్ తెలిపారు.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర కేవలం రూ.10 క్షీణించింది. రూ.51,380కు తగ్గింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.10 తగ్గుదలతో రూ.47,100కు తగ్గింది.