ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్, సాంగ్ కూడా విపరీతంగా అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం మార్చి 13వ తేదీన చాలా గ్రాండ్ గా విడుదల కాబోతోంది ఇటువంటి సందర్భంలోని చిత్ర బృందం ప్రమోషన్స్లో భాగంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గెస్ట్ గా తీసుకువచ్చారు. ఇందులో భాగంగా థమన్ మాట్లాడుతూ హర్ష్ రోషన్, శ్రీదేవి జంటపైన పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మీ ఇద్దరికీ కెమిస్ట్రీ ఫిజిక్స్ అవ్వకుండా చూసుకోండి అంటూ థమన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి.
ఈ జంట అభిమానులు కూడా వీరి మధ్య ఏదో సంథింగ్ ఉందంటూ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వీటికి తోడు ఇటీవలే ఈ సినిమా నుంచి విడుదలైన పాట తిప్పుకుంటున్నావ్ అనే సాంగ్ విడుదల చేయగా ఈ పాటకి ఇద్దరు కలిసి స్టెప్పులు వేయడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ విషయానికి మరింత బలాన్ని చేకూర్చింది. మరి రాబోయే రోజుల్లో ఈ జంట పైన వస్తున్న లవ్ రూమర్స్ పై ఏ విధమైనటువంటి క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి. బ్యాండ్ మేళం చిత్రానికి సతీష్ జివ్వాజి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో మరొకసారి సక్సెస్ కొట్టాలని అభిమానులు భావిస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి