టాలీవుడ్ సినీ పరిశ్రమలో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో నిరంతరం సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తూ ఉంటుంది హీరోయిన్ పూనమ్ కౌర్. ఈమె చేసే ట్వీట్స్ ఎప్పుడు కూడా సంచలనంగా మారుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా పేరు ప్రస్తావించకుండా కామెంట్స్ చేసే పూనమ్ ఈసారి మాత్రం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సంబంధించి ఒక పోస్ట్ ని ట్వీట్ చేయడంతో సంచలనంగా మారింది. వాటి గురించి చూద్దాం.


ఇటీవలే సోషల్ మీడియాలో , ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సనాతన ధర్మం ,హిందూ సాంప్రదాయాల గురించి వెంకటేశ్వర స్వామి చిత్రాలు ప్రదర్శించడం ఇతరత్రా అంశాల పైన అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ విషయాలను ఒక నెటిజన్ ట్విట్ చేయగా వాటికి రిప్లై ఇచ్చింది పూనమ్ కౌర్. ఈ ట్వీట్ లో ఆయన వ్యక్తిగత జీవితం పిల్లల మతం గురించి లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ముస్లిం క్రిస్టియన్ అయితే ఇలాంటివి జరిగేది కాదు. కేవలం హిందువులు ఐక్యమత్యంగా లేకపోవడం వల్లే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. హిందువులు మారాలి వాళ్లు మారానంతవరకు పరిస్థితి ఇలానే ఉంటుంది. హిందువులను విడగొట్టి ముక్కలు ముక్కలుగా కులాలతో రాజకీయాలు చేస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోని ఒక నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇందుకు పూనమ్ కౌర్ స్పందిస్తూ.. మూడు నెలల వయసులో తన పిల్లలను విదేశాలకు  తీసుకువెళ్లి బాస్టిజం ఇప్పించి, తన వారసత్వాన్ని ఆర్థోడాక్స్ క్యాథలిక్ క్రైస్తవంలోకి ఎందుకు మార్చారు? హిందువుగా ఉండడమంటే కేవలం రాజకీయాల లబ్ధి కోసమే ఆ కాస్ట్యూమ్స్ ధరించడమేనా? విదేశాలకు వెళ్లగానే ఆ కాస్ట్యూమ్స్ మారిపోతూ ఉంటాయా? అంటూ  పోస్టును షేర్ చేసింది పూనమ్ కౌర్. ప్రస్తుత రాజకీయాలలో ఎక్కువగా హిందుత్వం, సనాతన ధర్మం చుట్టూనే తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.. రాజకీయ లబ్ధి కోసమే ఆ ధర్మాలను వాడుకుంటున్నారా అనేకోణంలో ఆమె విమర్శలు చేసినట్లు పలువురు నేటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: