పసిడి ప్రియులకు శుభవార్త.. 10 గ్రాముల 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర రూ.45,700 వద్ద ఉంది. బుధవారం కూడా ఇదే ధర ఉండడం విశేషం. అంతకుముందు రోజు బంగారం రూ.180 తగ్గి ఈ రేటు వద్ద స్థిరపడింది. ఇదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర కూడా ఇలాగే స్థిరంగా ఉంది. బుధవారం నాడు రూ.150 తగ్గి రూ.41,900కు చేరగా.. గురువారం కూడా ఆ రేటుతో కొనసాగుతుంది. వెండి ధర కిలోకు రూ.700 వరకూ తగ్గడం విశేషం.