బంగారం సామాన్యుడికి బహుదూరమైంది. బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఎప్పుడు పెరుగుతూ తగ్గుతూ ఉండే ఈ బంగారం ధరలు ఇప్పుడు పెరగడం తప్ప తగ్గడం లేదు. సాధారణంగానే మన భారత్ లో పసిడి ప్రియులు ఎక్కువ.. వారికీ పసిడిపై ఉండే మమకారం మారే దానిపై ఉండదు. అయితే ఇప్పుడు ఆ మమకారాన్ని అంత చంపుకోవాల్సి వస్తుంది.. కారణం కరోనా వైరస్. 

 

కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్లు పూర్తిగా కుప్ప కూలిపోయాయి.. దీంతో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లు అంత కూడా ఇప్పుడు బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు.. దీంతో బంగారం ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకుతున్నాయి.. దీంతో ఈరోజు కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయ్. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు శుక్రవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 350 రూపాయిల పెరుగుదలతో 47,750 రూపాయలకు చేరింది. ఇంకా అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 350 రూపాయిల పెరుగుదలతో 44,720 రూపాయలకు చేరింది. అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా అదే బాట పట్టింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 200 రూపాయిల పెరుగుదలతో 43,150 రూపాయిల వద్దకు చేరింది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలు దారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారంపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా మరో వైపు ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి. విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరలు ఇలాగే  కొనసాగుతున్నాయి.                                 

మరింత సమాచారం తెలుసుకోండి: