పసిడి ప్రియులకు శుభవార్త..  గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే, నేటి మార్కెట్ లో మాత్రం ధరలు కిందకు దిగి వచ్చాయి. బంగారం ధర తో కిందకు వస్తే వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.. పసిడి ప్రేమికులకు ఇది ఊరట కలిగించే అంశమని చెప్పుకోవచ్చు. గ్లోబల్ మార్కెట్‌లోనూ బంగారం ధర పడిపోయింది. ఇక విదేశీ మార్కెట్ లో బంగారం ధర పూర్తిగా కిందకు చేరింది.


హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.110 తగ్గుదలతో రూ.47,670కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. రూ.100 క్షీణతతో రూ.43,700కు పడిపోయింది. బంగారం ధర తగ్గితే.. వెండి రేటు మాత్రం అక్కడే స్థిరంగా ఉంది. వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. దీంతో కేజీ వెండి ధర రూ.71,900 వద్దనే ఉంది.  పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్థిరంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు.


అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర పడి పోయింది. బంగారం ధర ఔన్స్‌కు 0.14 శాతం తగ్గుదలతో 1764 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర దిగివస్తే వెండి రేటు కూడా ఇదే దారిలో పయనించింది. ఔన్స్‌కు 0.25 శాతం క్షీణతతో 25.89 డాలర్లకు చేరింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు మొదలగు అంశాలు బంగారం ధరల పై ప్రభావాన్ని అధికంగా చూపిస్తున్నాయి.. మరి రేపు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: