ప్రతిరోజు బంగారం ధరలలో హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక్కరోజు ధర పెరుగుతే.. మరో రోజు ధర తగ్గుతుంది. కరోనా, ఒమిక్రాన్ కారణంగా దేశంలో పలు పాంత్రాలలో బంగారం ధర స్థిరంగా ఉన్నా.. మరికొన్ని ప్రాంతాలలో బంగారం ధర సల్పంగా ఉంటుంది. నేడు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,950 ఉండగా.. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,210 చేరింది. అలాగే దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,940 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,940 వద్ద ఉంది.

అలాగే తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,000 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,010కు చేరుకుంది. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,100 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,800 ఉంది. ఇక కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 కొనసాగుతుంది. అలాగే కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,880 వద్దకు చేరింది.

ఇక మన తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు చూసుకున్నట్లయితే..  తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 ఉంది. అలాగే.. ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 వద్దకు చేరింది. విశాఖపట్టణంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 వద్దకి చేరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: