పసిడి కొనాలనుకునేవారికి ఈరోజు అంత మంచి రోజు కాదని చెప్పాలి..బంగారం ధరలు ఈరోజు మార్కెట్ లో దూసుకుపోతున్నాయి. గత కొన్ని రోజులుగా నిలకడగా లేని ధరలు నేడు మార్కెట్ లో మాత్రం రాకెట్ స్పీడ్ లో పైకి కదిలింది. నిన్న ధరలతో పోలిస్తే నేడు మార్కెట్ లో బంగారం ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో బంగారం కొనాలని భావించే మహిళలకు బ్యాడ్ న్యూస్.. అనే చెప్పాలి. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి.. ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు భారీగా కిందకి దిగి వచ్చాయి..


విదేశీ మార్కెట్ లో ధరలు తగ్గినా, మన దేశంలో మాత్రం షాక్ ఇస్తున్నాయి.అందుకే నేడు పుత్తడి ధరలు మార్కెట్ లో పరుగులు తీస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం...శుక్రవారం బంగారం ధర భారీగా పెరిగింది.10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 640 పెరిగింది. దీంతో ఇప్పుడు బంగారం ధర రూ. 52,310కు నమోదు అవుతుంది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అలాగే నడిచింది. పసిడి రేటు రూ.600 పెరగడంతో రూ. 47,950కు చెరిందు.. బంగారం ధరలు భారీగా పెరిగితే.. వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. రూ.900 పరుగులు పెట్టింది. నేడు మార్కెట్ లో వెండి ధర రూ. 72,800కు చేరింది. విజయవాడ, విశాఖపట్నంలో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


విదేశీ మార్కెట్ లో పసిడి ధరలు నేల చూపులు చూస్తున్నాయి. వెండి కూడా అదే దారిలో నడిచింది. ఒకసారి అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం, వెండి ధరలను చూస్తె..ఔన్స్‌కు 0.12 శాతం దిగి వచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1959 డాలర్లకు వచ్చింది. బంగారం ధర తగ్గితే వెండి రేటు కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.20 శాతం తగ్గుదలతో 25.86 డాలర్లకు దిగి వచ్చింది. బంగారం ధరల పై ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, మార్కెట్ లో ధరల నియంత్రణ తో పాటు మరి కొన్ని పరిస్థితులు ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మరి రేపు మార్కెట్ లో ధరలు ఇలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: