చాలామంది ప్రతిరోజు ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు టీ తాగుతూ ఉంటారు. ఒకటీ రెండు కప్పుల టీ తాగడం వలన శరీరానికి ఎటువంటి నష్టం లేదు కానీ మోతాదుకు మించి టీ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరం. టీ ఎక్కువగా తాగే వారిలో ఐరన్ శాతం తగ్గుతుంది. టీ ఆకుల్లో ఉండే ఆర్గానిక్ కాంపౌండ్లు ఐరన్ శోషించుకోవడాన్ని ఆపేయాస్తాయని పరిశోధనల్లో తేలింది. శాఖాహారుల్లో మాంసాహారుల్లో కంటే ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 
 
టీ ఆకులలో ఉండే కెఫిన్ అనే పదార్థం ఉత్తేజితం చేయడంతో పాటు ఒత్తిడికి కూడా గురి చేస్తుంది. వైట్ టీ, గ్రీన్ టీలతో పోలీస్తే కెఫిన్ ఎక్కువగా బ్లాక్ టీలో ఉంటుంది. టీ ఎక్కువగా తాగే వారిలో నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి. మెలటోనిన్ అనే హార్మోన్ శరీరాన్ని నిద్రకు సహకరించేలా చేస్తుంది. కానీ ఎక్కువగా టీ తాగేవారిలో మెలటోనిన్ ఉత్పత్తి తగ్గటం వలన నిద్ర లేమి సమస్యలు ఏర్పడతాయి. టీ ఎక్కువగా తాగేవారికి తలనొప్పి, తల తిరగడం మొదలైన సమస్యలు వస్తాయి. 
 
ఒకేసారి అధిక మొత్తంలో టీ తాగేవారికి అజీర్ణం, తలనొప్పి, మొదలైన సమస్యలు వస్తాయి. ఎక్కువగా టీ తాగే వారికి నోరు పోడిబారడంతో పాటు నోరు చేదుగా మారుతుంది. మితంగా టీ తాగితే మాత్రం టీ వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.టీ పాడైన జీవ కణాలను ఉత్తేజపరచటంతో పాటు జీర్ణాశయ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ కారకాలను నిర్వీర్యం చేయడంతో పాటు గుండె వ్యాధులు, బరువు తగ్గడాన్నిటీ నిరోధిస్తుంది. రోజుకు రెండు కప్పులకు మించి టీ తాగడం మాత్రం మంచిది కాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: