చైనాలో కరోనా వైరస్ నియంత్రణ చేయటానికి ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. దానికి తగ్గ ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పరిస్థితి మాత్రం అదుపు లోకి రావడం లేదు. ఇప్పటికే ఆ దేశంలో 200  మంది కరోనా వైరస్‌ తో ప్రాణాలు విడిచారు. ఇంకా... కరోనా వైరస్ ఉందన్న అనుమానంతో వేలాది మంది రోగులు హాస్పిటళ్ల ముందు క్యూ కడుతున్నారు. దీంతో అక్కడి వైద్యులు, నర్సులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.


ఇలా కొరోనా రోగులు హాస్పిటల్స్ కి పోవటం వలన.. కరోనా వైరస్ వల్ల వైద్యులు, నర్సులు కూడా ఈ వ్యాధికి గురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం వారికి ప్రత్యేక సూట్‌ లు సిద్ధం చేసింది. ఇంకా వాటిని ధరించాలంటే జట్టు ఎక్కువగా ఉండకూడదు. దీంతో వైద్యులు, నర్సులు తమ జుట్టు కత్తిరించుకుని మరీ ఆ సూట్‌ లు వేసుకుంటున్నారు. .


అయితే... జుట్టు బయటకు కనిపించి నట్లయితే.. జుట్టు వైరస్‌ ను గ్రహించవచ్చని డాక్టర్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉహాన్ హాస్పిటల్‌ లోని దాదాపు అన్ని హాస్పిటల్‌ లో నర్సులు తమ పొడవైన జుట్టు కత్తిరించుకుని ఈ సూట్లను ధరిస్తున్నారు. రోగులను కాపాడే లక్ష్యం ముందు.. జట్టు పెద్ద విషయం కాదని అంటున్నారు. జుట్టు కత్తిరించినా మళ్లీ వస్తుంది. కానీ, ప్రాణాలు పోతే మళ్లీ తిరిగిరావని తెలుపుతున్నారు.


నుర్సులకు, డాక్టర్ల కు సూట్లు ధరించడం వల్ల మాట్లాడ లేని పరిస్థితి నెలకొంది. దీంతో నర్సులు, డాక్టర్లు.. రాతలు, సైగల ద్వారానే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటున్నారు. చివరికి రోగులతో కూడా సైగలు చేస్తూనే మాట్లాడుతున్నారు. మొత్తం కప్పి ఉంచే సూట్లలో వైద్యులు, నర్సులను గుర్తించడం కష్టం. దీంతో వారి సూట్ల వెనుక పేర్లు రాసుకుంటున్నారు. ఇంకా ఇలాంటి దయనీయ పరిస్థితులు ఎన్నో అక్కడ కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: