నేటి కాలంలో చాలా మంది గ్యాస్ ప్రాబ్లెమ్‌తో బాధ‌ప‌డుతున్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం మారిన జీవ‌నశైలి విధాన‌మే అని చెప్పొచ్చు. ఈ సమస్య ఒక్కోసారి బాధాకరమైనదిగా లేదా తేలికపాటిదిగా కూడా ఉండొచ్చు. ఆహారం తీసుకున్న కాసేపటికే ఆకలి వేయడం, కొంచెం తినగానే కడుపు నిండినట్లుండటం, ఛాతిలో నొప్పిగా అనిపించడం, గొంతులో మంటగా ఉండి, పుల్లటి తేన్పులు రావడం.. ఇవన్నీ గ్యాస్‌ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలే. అయితే దీని త‌గ్గించుకోవ‌డం కోసం ఏవేవో మందులు మింగేస్తుంటారు. కాని, ఈ స‌మ‌స్య‌కు సింపుల్ టిప్స్‌తోనే చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

అందుకు ముందుగా ఒక బౌల్‌లో నీటిని తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి బాగా మ‌రిగించాలి. ఇప్పుడు అందులో ఒక‌ టీస్పూన్ తేనె క‌లిపి వేడిగా ఉండ‌గానే తాగితే గ్యాస్ సమస్య త‌గ్గుతుంది. ప్రారంభ దశలో గ్యాస్‌ సమస్యని ఎవరికి వారే నివారించుకోవచ్చు. సరైన ఆహారపు అలవాట్లు, మితాహారం, అలర్జీ కలిగించే ఆహారానికి దూరంగా ఉంటూ డైట్‌ డైరీ పాటిస్తే గ్యాస్‌ట్రబుల్‌ సమస్య రాకుండా నివారించవచ్చు. వాటితోపాటు ఆహారాన్ని ఎక్కువగా నమిలి తినాలి. 

 

ఇక గ్యాస్ సమస్య తీవ్రంగా ఉంటే.. ఒకటి, రెండు లవంగాలను నోట్లో వేసుకుంటే గ్యాస్, అసిడిటీ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అదేవిధంగా, ఒక బౌల్‌లో కొద్దిగా నీటిని తీసుకుని జీల‌క‌ర్ర నాలుగు టీస్పూన్లు వేసి నీటిని బాగా మ‌రిగించి తర్వాత నీటిని వ‌డ‌క‌ట్టి వేడిగా ఉంగానే తాగేయాలి. దీంతో గ్యాస్ స‌మస్య నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. మ‌రియు భోజనం చేసిన తర్వాత చిన్న మొత్తంలో తాజా అల్లాన్ని నమలితే గ్యాస్ ప్రాబ్లెమ్‌కు సులువుగా చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: