కరోనా వైరస్ కల్లోలం అంత ఇంత కాదు . కరోనా భారీన పడి దేశదేశాలు జుట్టు పీక్కుంటున్నాయి. ఈ వైరస్ సోకని దేశం అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. దాదాపుగా అన్ని దేశాలలో ఈ వైరస్ విచ్చలవిడిగా వ్యాపిస్తోంది. మన దేశం లో కూడా ఈ మహమ్మారి వ్యాప్తి అధికంగా పెరుగుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారిని ఆపడానికి లాక్ డౌన్ మాత్రమే పరమౌషధం అని తలచి లాక్ డౌన్ ప్రజలంతా పాటిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో లాక్ డౌన్ కొనసాగిస్తూనే ఉన్నాం. తద్వారా వైరస్ కట్టడికి మనవంతు సహాయం చేస్తున్నాం. ప్రజలంతా లాక్ డౌన్ కారణంగా ఇళ్లలో ఉండిపోయారు. ఖాళీ సమయాల్లో కరోనా గురించి తెగ వెతికేస్తూనే ఉన్నారు.

 

అయితే ముఖ్యంగా కరోనా గురించి ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. కరోనా వ్యాధి ఎలా సోకుతోందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇదిలా ఉంటె ఆన్ లైన్ లో ఎక్కువ శాతం దోమ కాటు వల్ల కరోనా వ్యాపిస్తుందా అని అడుగుతున్నారు. ఎందుకంటె లాక్ డౌన్ అయితే తీసుకున్నాం గాని దోమలు మాత్రం లాక్ డౌన్ తీసుకోలేదని అంటున్నారు .దోమలు తమని కుట్టికొట్టి చంపుతున్నాయని వాపోతున్నారు. ఈ ప్రశ్నకు వైద్యులు సమాధానం ఇస్తూ... దోమకాటు ద్వారా కరోనా రాదూ అని తేల్చేశారు. దోమ, చీమ, ఈగలు ఇతర కీటకాల ద్వారా, అవి కరోనా సోకిన వ్యక్తిని కుట్టి వచ్చి మరల ఆరోగ్యవంతుడిని కుట్టినప్పటికీ... కరోనా మాత్రం రాదూ అని డాక్టర్లు తేల్చి చెబుతున్నారు. అయితే ప్రపంచదేశాలు కరోనాకు విరుగుడు మందును కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ప్రపంచమంతా కరోనా కట్టడి చేయడానికి సైంటిస్టులు కష్టపడుతున్నారు.

 

అయితే చైనా మటుకు ఓ కొత్త వైద్యాన్ని చేయాలనుకొంటుంది అదేంటంటే కరొనను తట్టుకొని రిలీజ్ అయిన పేషేంట్  యొక్క రక్తాన్ని సేకరించి రక్తంలోని ప్లాస్మాద్వారా పాజిటివ్ ఉన్న వ్యక్తి కి ఉపయోగిస్తే వ్యాధి నయమౌతుందని తెలియజేశారు. ఈ విధానంపై భారీ స్థాయిలో అధ్యయనం చేయడానికి అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎఫ్‌డీఏ) అనుమతుల కోసం అక్కడి ఆస్పత్రులు ఎదురుచూస్తున్నాయి.'ఇది చేసే వరకు మాకేమీ తెలియదు. కానీ, చారిత్రక ఆధారాలు మాత్రం ప్రోత్సాహకరంగా ఉన్నాయి' అని జాన్స్‌ హాప్కిన్స్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన డాక్టర్‌ అర్టురో కేసడ్‌వాల్‌ తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: