రోజా పూలు అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి.. ప్ర‌తి ఒక్క‌రూ వీటిని లైక్ చేస్తారు. సాధార‌ణంగా ఎవ‌రు ఎవ‌రికి ఏ పూలు అయినా  పెట్ట‌వ‌చ్చేమో.. లేదా ఇవ్వ‌వ‌చ్చేమో గాని.. అమ్మాయి, అబ్బాయి ఇచ్చుకునేవి.. పుచ్చుకునేవి మాత్రం రోఆ పూలే. అయితే రంగురంగులుగా పూసే రోజా పూలు ఇచ్చుకునేందుకు.. పుచ్చుకునేందుకు మాత్ర‌మే కాదు.. ఆరోగ్య‌పరంగా కూడా ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఈ విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. మ‌రి ఈ రోజా పూల వ‌ల్ల ఆరోగ్యానికి క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏంటి..? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

IHG

చూడగానే ఎంతో అందంగా కన్పించే రోజా పూలకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ముఖ్యంగా రోజా పూల రేకులను తినడం వల్ల పలు రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రోజా పూల రేకులు శృంగార జీవితానికి చాలా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం.. రోజా రేకులను ప్ర‌తి రోజూ గుప్పెడు తింటూ వస్తే అవి మన శరీరంలోని దోషాలను పోగొడుతాయి. తద్వారా రక్తశుద్ధి జరుగుతుంది. మ‌రియు వీటికి వీర్యవృద్ధిని కలిగించే గుణం పుష్క‌లంగా ఉంది. అలాగే బరువు తగ్గాలనుకునేవారు రోజా పూల రేకులను తీసుకోవ‌డం మంచిది.

IHG

నేరుగా వీటిని తినలేకపోతే.. ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకున్నా మంచి ఫలితం పొంద‌వ‌చ్చు. అలాగే రోజా రేకులతో తయారు చేసే కషాయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మార్కెట్లలో లభించే ఔషధాల కంటే కూడా ఇది బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మీ చర్మానికి ఇది కొత్త మెరుపును అందిస్తుంది. చర్మంపై ప్రధానంగా మొహంపై మొటిమల వల్ల ఏర్పడిన మ‌చ్చ‌ల‌ను త‌గ్గించ‌డంలో ఇది ఎంతో చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది. ఒత్తిడిలో ఉన్న‌ప్పుడు రోజ్ పూలను వాసన చూస్తే వెంట‌నే ఉపశమనం  పొందొచ్చు. ఇక రోజా రేకుల‌ను తిన‌డం వ‌ల్ల‌ శరీరంలో మెటబాలిజం చక్కగా పనిచేస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: