చికెన్.. మాంసాహారులకు అతి ఇష్ట‌మైన‌ది. ముఖ్యంగా సండే వచ్చిందంటే చాలు చాలా ఇళ్లల్లో చికెన్ కుతకుత ఉడుకుతుంటుంది. ఇక మొత్తం చికెన్‌ పెట్టినా లాగించేసే చికెన్ ప్రియులు చాలా మందే ఉన్నారు. అయితే చికెన్ ఆరోగ్యానికి మంచిదా..? కాదా..? అన్న ప్ర‌శ్న చాలా మందిలో ఉంది. వాస్త‌వానికి తాజా చికెన్ మన ఆరోగ్యానికి చాలా మందంటున్నారు నిపుణులు. చికెన్ లో ఉండే క్యాల్షియం, పాస్పరస్ వంటివి ఎముకల ఆరోగ్యానికి స‌హాయ‌ప‌డ‌తాయి. ఇది చాలా సన్నగా, పీలగ ఉన్న వారికి తగినంత బలాన్ని చేకూర్చుతుంది. కాబట్టి అటువంటి వారు చికెన్ సూప్ ప్రతి రోజూ తీసుకుంటే మంచి ప‌లితం పొందొచ్చు.

 

అలాగే శరీరంలోని కండ పెరగడానికి, అభివృద్ధి చెందడానికి ఉపయోగపడే లీన్ ప్రోటీన్ చికెన్‌లో అత్యధికంగా లభిస్తుంది. జింక్ కూడా చికెన్‌లో పుష్క‌లంగా ఉంటుంది. అందుకే చికెన్ తినేవారిలో ఎముకల పెరుగుదల అద్భుతంగా ఉంటుంద‌ని నిపుణులు అంటున్నారు. చికెన్ కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది. అయినా కూడా దాంట్లో నియాసిన్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్ లెవల్ ను తగ్గిస్తుంది. కాబట్టి చికెన్ ఆయిల్ వేయకుండా వండి తినడం వల్ల గుండె ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది.

 

అదేవిధంగా, చికెన్ లో చాలా రకాల పోషకాంశాలు ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచి ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఇక పెప్పర్ సూప్ లో ఉడికించిన చికెన్ ను తీసుకోవడం వల్ల జలుబుకు తక్షణ ఉపశమనమిస్తుంది. అలాగే చికెన్‌లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది, ఇది కళ్ళ కండరాలు కూడా బలంగా ఉంటుంది. మ‌రియు ఇది కంటి చూపును పెంచడానికి ఉప‌యోగ‌పడుతుంది. ఇక చికెన్ తినడం వ‌ల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.ఎందుకంటే.. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు చికెన్‌లో పెద్ద మొత్తంలో లభిస్తాయి. ఇది క్యాన్సర్‌ను నివారిస్తుంది. పెరిగే పిల్లలకు కూడా చికెన్ పెట్ట‌డం చాలా మంచిది. చికెన్ లో అధికమైన అమినోఆసిడ్స్ పిల్లలు పొడవుగా మరియు శక్తివంతంగా పెరగడానికి స‌హాయ‌ప‌డుతుంది.

 
  
   
 

మరింత సమాచారం తెలుసుకోండి: