ప్రపంచవ్యాప్తంగా చాలామంది కాఫీ కంటే టీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మరీ ముఖ్యంగా వీరంతా చాలా రకాల వెరైటీ టీలను ఇష్టపడుతూ ఉంటారు. ప్రస్తుతం టీ లో కూడా చాలా రకాల వెరైటీలు రావడంతో చాలామంది ఈ వెరైటీలను ఇష్టపడి టీ లకు ప్రియులు అవుతున్నారు.  ఇప్పటివరకు మనం అల్లం టీ, యాలకుల టీ, లెమన్ టీ, పుదీనా టీ, గ్రీన్ టీ అంటూ ఎన్నో రకాల టీల గురించి విన్నాం, తాగాం  కూడా.  ఇప్పుడు సరికొత్తగా మార్కెట్లోకి బటర్ టీ అని వచ్చి, టీ  ప్రియులను  ఆశ్చర్యపోయేలా చేస్తోంది. ఇది విన్న వారంతా ఏది దొరికితే దానితో  టీ చేసేస్తారా..? అంటూ కొంతమంది మండిపడుతూ ఉంటే, మరి కొంతమందేమో అరే ఇది బలే విడ్డూరంగా ఉందే..! అంటూ ఆశ్చర్యపోతూ..! ముక్కున వేలు వేసుకుంటున్నారు .  అసలు ఇంతకీ ఈ బటర్ టీ ని  ఎవరు? ఎక్కడ? ఎలా? తయారు చేశారో? దాని స్పెషల్ ఏంటో? ఇప్పుడు చూద్దాం.


పూర్తి వివరాల్లోకి వెళితే ఆగ్రాలోని బాబా టీ స్టాల్ లో ఒక వ్యక్తి టీ ని తయారు చేస్తున్నాడు. అక్కడ టీ మరుగుతోంది. అందులో ఒక వ్యక్తి మరుగుతున్న టీ లోకి బటర్ ను  వేశాడు. బటర్ వేయడం  ఏంటి?అని ఆశ్చర్యపోతున్నారా..! అవునండీ.. ఇది నిజమే ఆ వ్యక్తి మరుగుతున్న టీ  లోకి బటర్ ముక్కను కట్ చేసి, అందులో వేసి అందరిని ఆలోచింపచేశాడు.ఆ తరువాత ఆ బటర్  బాగా మరిగి టీ లో  కలిసిపోయింది. అలా బాగా మరిగిన టీ ని  వడగొట్టి మిగిలిన డికాక్షన్ మొత్తం పారవేశాడు ఆ వ్యక్తి.

ఇలా తయారు చేసిన టీ ని,టీ తాగడానికి వచ్చిన ఒక వ్యక్తి వీడియో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.  ఇక పోస్ట్ చేసిన కొద్దిసేపటికే  ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ  ఇదేమిటి చాలా విభిన్నంగా ఉందని కొంతమంది ఆశ్చర్యపోతుంటే, మరికొంతమంది టీ లో బటర్ వేయడం ఏంటి అని చిరాకు పడుతుంటారు. వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికి వైరల్ గా మారి అది  వైద్యుల దృష్టికి వెళ్ళింది.

ఇక వైద్యులు కూడా ఈ  టీ ని తయారు చేసి మరీ, పరీక్షించటం జరిగింది. అయితే ఇందులో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. బటర్ టీ తాగడానికి రుచి కరంగా ఉంటుంది కానీ అందరికీ సెట్ అవ్వదు. కొంతమందిలో వికారంగా అనిపించడం జరిగితే, మరికొంతమందిలో వాంతులు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.అయితే ఎవరో ఒకరు చేసిన పని మీరు కూడా ప్రయత్నించి ఇబ్బందులు పాలవకుండా ఉండడమే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: