మన భారతదేశపు సాంప్రదాయ వంటల్లో ముఖ్యంగా తెలుగింటి వంటకాల్లో కరివేపాకు కు ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కరివేపాకు వేయనిదే ఏ వంటకూ రుచి, వాసన రాదు అనేది మన వారి విశ్వాసం. అయితే కరివేపాకు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. మరీ ముఖ్యంగా కరివేపాకులతో టీ తయారు చేసుకొని, తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అంతా ఇంతా కాదని కూడా వారు చెబుతున్నారు. నిజానికి కరివేపాకు టీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..


ముఖ్యంగా కరివేపాకు టీని ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

కరివేపాకులను శుభ్రంగా కడిగి,ఒక గిన్నెలో  వేసి, అందులో నీరు పోసి స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. అలా కరివేపాకు నీటిలో మరుగుతున్నప్పుడు నీటి రంగు మారుతుంది. తరువాత నీటిని ఒక కప్పులోకి ఫిల్టర్ సహాయంతో వడకట్టుకోవాలి.  అందులో కొంచెం తేనె, బెల్లం కలిపి తాగితే రుచికి రుచి ఉంటుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా చేకూరుతుంది.  అదే నల్ల బెల్లం కలిపి తాగితే ఇంకా మంచిది. అదే నీటిలో కొద్దిగా తేనె, నిమ్మరసం కూడా కలిపి తాగవచ్చు..


ఈ కరివేపాకు టీ తాగడం వల్ల మూత్రాశయం బాగా పనిచేస్తుంది. అలాగే గ్యాస్, మలబద్ధకం, కడుపులో మంట విరేచనాల సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాకుండా కరివేపాకు టీ లో ఉండే అరోమా నరాలను రిలాక్స్ చేసి,ఒత్తిడిని తగ్గిస్తుంది. మరీ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ కరివేపాకు టీని తాగడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటూ నీరసం, వికారం, వాంతులు కావడం వంటి సమస్యల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. అంతే కాకుండా కరివేపాకు టీ విరోచనాలకు మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలెక్స్ కారణంగా చర్మాన్ని నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతుంది. ఇక చర్మం కూడా ఆరోగ్యవంతంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: