
ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కొద్దిగ జ్వరాలు రావడం కామన్, శరీరం తనను తాను మరమ్మతులు చేసుకునే సమయంలో వచ్చే అనారోగ్యమే ఈ " జ్వరం". దీనిద్వారా హానికరమైన బ్యాక్టీరియా, క్రిములు వైరస్లు శరీరంలో నుండి బయటకి వెలువడతాయి. లేకపోతే వీటి వల్ల ఇతర ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంది. ఇతర క్రిములు పెరగకుండా ఉండేందుకు శరీరం తనను తాను మరమ్మతులు చేసుకుంటుంది. అయితే ఈ జ్వరం వచ్చినప్పుడు కొంతమందికి నీరసంగా ఉండి, ఏది తినాలన్న నోటికి రుచి రాదు.
జ్వరం వచ్చినప్పుడు చాలామందికి ఒక సందేహం కలుగుతుంది. జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం తినవచ్చా..?( చికెన్, మటన్,ఫిష్,ఎగ్స్ లాంటివి నాన్ వెజ్ వంటకాలు )ఒకవేళ తింటే ఏమవుతుంది..? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. అయితే కొంతమంది తింటారు. మరి కొంతమంది పచ్చకామర్ల వస్తాయని భయపడుతుంటారు. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలుసుకుందాం.
సాధారణంగా ఎవరికైనా జ్వరం వస్తే జీర్ణ శక్తి బాగా తగ్గిపోతుంది. దీంతో డాక్టర్లు తేలికగా అరిగే ఆహారాన్ని తీసుకోమంటారు. అలాంటప్పుడు సరిగ్గా జీర్ణం కాని మాంసాహారం తింటే దాంతో లివర్ పై ఎక్కువ భారం పెరుగుతుంది. దీంతో లివర్ పనితీరు మందగిస్తుంది. అలాంటప్పుడే పచ్చకామెర్లు వస్తాయి. కనుక జ్వరం వచ్చినప్పుడు మాంసాహారం అసలు తినరాదు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది.అందువల్ల ఆయిల్ ఫుడ్ తగ్గించడమే మేలు.
జ్వరం లేకపోయినప్పటికీ కొందరికి పచ్చకామర్లు ఎందుకు వస్తాయి అంటే. ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడం వల్ల, బయట దొరికే చిరుతిళ్లు తినేవారికి, కూల్ డ్రింక్స్ తాగేవారికి పచ్చకామర్లు వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అంతే కాకుండా మద్యం సేవించడం వల్ల కూడా పచ్చకామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పనులు అన్నీ చేస్తే లివర్ గందరగోళానికి గురి అవుతుంది. దీంతో లివర్ పనితీరు మందగించి, కామెర్లు వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంది.