కరోనా మహమ్మారి వచ్చాక చాలామందికి మానసిక ప్రశాంతత లేకుండా పోయిందని చెప్పవచ్చు. మహమ్మారి టెన్షన్ కి తోడుగా ఉద్యోగ సమస్యలు, డబ్బు, వ్యాపార సమస్యలు, కుటుంబ సమస్యలు చాలా మందిని బాధిస్తున్నాయి. దీంతో ఒక్క రోజు కూడా బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. స్వచ్ఛమైన గాలి అందడం లేదు. దీంతో మానవుల్లో కోపం, చిరాకు, ఇతర ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. వీటిని తగ్గించుకోకపోతే నేరాలకు దారితీస్తాయి. వీటి నుండి బయటపడాలంటే సహజమైన ఎక్సర్సైజులు, యోగా చేయాలి.
ఊపిరి ఎలా పీల్చలో, శరీరానికి ఆక్సిజన్ ఎక్కువ ఎలా పంపాలో ప్రాణాయామం ఆసనం ద్వారా తెలుస్తుంది. దీనివల్ల రక్తనాళాల్లో ఆక్సిజన్ లెవెల్ పెరుగుతుంది. ఆస్తమా లక్షణాలను తగ్గిస్తాయి. దీంతో మానసికంగా ఫిట్ అవుతారు. బ్రిడ్జి ఫోజ్.. దీన్ని సేతు బంధాసనం అంటారు. ఈ ఆసనం మానవ శరీరంలో రక్తప్రసరణను వేగవంతం చేస్తుంది. ఈ మనలోని ఆత్రుత, మదనపడేతత్వాన్ని అదుపులో ఉంచుతుంది. కాళ్లు, వెనక భాగం మరింత చక్కగా సాగి నిద్ర బాగా పట్టేలా చేస్తుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి