రష్మిక విజయ్ దేవరకొండ..చాలా రోజులుగా టాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా ఉన్న ఈ జంట ఫైనల్ గా పెళ్లి బంధంతో భార్యాభర్తలు గా మారిపోయారు. ఇన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాలు నిజం చేస్తూ ఈ జంట రాజస్థాన్లోని ఉదయపూర్ ప్యాలెస్ వేదికగా అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు.ఈ పెళ్లిలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా విజయ్ దేవరకొండ రష్మిక మందన్నాల పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వేషధారణ నిలిచింది. దానికి కారణం రష్మిక మందన్నా మెడ నిండా నగలు వేసుకుందంటే అది మామూలు విషయమే..కానీ విజయ్ దేవరకొండ కూడా తన మెడలో హారాలు,చెవి దుద్దులు, చేతికి కడియాలు,చేతుకు వంకీలు,కాళ్లకు కడియం పెట్టుకోవడంతో చాలామంది విజయ్ దేవరకొండ పెళ్లి కొడుకు వేషధారణ చూసి ఆశ్చర్య పోయారు.

 ఇదేంటి విజయ్ దేవరకొండ పెళ్లిలో ఇలా రెడీ అయ్యారు అని.. కానీ ఆ పెళ్లి చూస్తుంటే రాజుల పెళ్లిని తలపిస్తున్నట్టు ఉంది. ఇదిలా ఉంటే పెళ్లయితే ఖచ్చితంగా అమ్మాయి అత్తవారింటికి కట్నం తీసుకొని వస్తుంది. ఈ తంతు సామాన్య కుటుంబం నుండి మొదలు కోటీశ్వరుల పెళ్లిల్లో కూడా కనిపిస్తుంది. అమ్మాయి అత్తవారింటికి వెళ్ళింది అంటే కచ్చితంగా కట్నకానుకలు తీసుకువెళ్తుంది.స్థాయిని బట్టి అత్తవారింటికి కొత్త పెళ్లికూతురు కట్నాలు తీసుకువెళ్తుంది.ఇదిలా ఉంటే రష్మిక మందన్నా విజయ్ దేవరకొండ ఇంటికి కూడా భారీగానే కట్నం తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది.మరి ఇంతకీ రష్మిక మందన్నా అత్త వారింటికి ఎంత కట్నం తీసుకువెళ్లింది అనేది చూస్తే..

 సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని పోస్టుల ప్రకారం రష్మిక విజయ్ దేవరకొండకు 150 కోట్ల కట్నం ఇవ్వడంతో పాటుగా విజయ్ దేవరకొండకు రష్మిక పేరెంట్స్ నుండి బహుమతులుగా లగ్జరీ కార్, లగ్జరీ విల్లా కూడా వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉంది.. 150 కోట్ల కట్నం నిజంగానే రాష్మిక తీసుకువచ్చిందా అనేదాంట్లో క్లారిటీ లేదు కానీ ఖచ్చితంగా రష్మిక విజయ్ ని పెళ్లి చేసుకోవడానికి భారీ గానే కట్నం అప్పజెప్పినట్టు తెలుస్తోంది. ఇక రష్మిక తన సినిమాల ద్వారా బాగానే సంపాదిస్తుంది. ఇటు విజయ్ దేవరకొండ సినిమాలు ఫ్లాప్ అయినా ఇతర బిజినెస్ ల వల్ల భారీగానే సంపాదిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: