ప్రపంచ చరిత్రలోనే ఇదో అరుదైన సంఘటన,  ఈ బుడతడు ప్రపంచంలోనే అత్యంత తక్కువ రోజులకు భూమి మీదికి వచ్చిన వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు.  ఇలాంటి రికార్డును మనం ఇప్పటి వరకు చూడలేదు. ఇలా రికార్డు సృష్టించిన ఈ బుడతడు బతికే ఛాన్స్ తక్కువగా ఉన్నదని డాక్టర్లు తేల్చి చెప్పారు. కానీ   మొదటి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు.  అమెరికాకు చెందిన బెత్రిక్ దంపతులకు 2020 జూన్ 5  తేదీన ఈ బుడతడు జన్మించాడు.  ఇతని పేరు రిచర్డ్ స్కాట్ విలియం.  అయితే విలియం బతికే ఛాన్స్ తక్కువ అని డాక్టర్ తేల్చేశారు.  కానీ తల్లిదండ్రుల యొక్క నిరంతర పర్యవేక్షణలో రిచర్డ్ తన మొదటి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నాడు.  21 వారాల రెండు రోజులకు జన్మించి బతికిన శిశువుగా రిచర్డ్ స్కాట్ విలియం గిన్నిస్ బుక్ లో ప్రపంచ రికార్డు సాధించాడు.  

 అతని బరువు  340 గ్రాములు.  26 సెంటీమీటర్ల పొడవుగా ఉన్నాడు.  నిజానికి బెత్ హచిన్సన్ డెలివరీ సమయం 2020 అక్టోబర్ 13. అయితే కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ముందే బిడ్డను ఆపరేషన్ చేసి బయటకు తీశారు. దీనిపై వైద్యులు బెత్ హచిన్సన్  భర్త రిక్  హచిన్సన్ తో వైద్యులు తీవ్రమైన చర్చలు చేసిన తర్వాత బిడ్డను బయటకు తీశారు. ఆ బుడతడు జన్మించినప్పుడు,  కేవలం 340 గ్రాముల బరువు,  26 సెంటీమీటర్ల పొడవుతో అరచేతిలో సరిపోయే విధంగా ఉన్నాడు.  ఇతడి బరువు పూర్తికాలం నవజాత శిశువు బరువులో పదో వంతు ఉన్నాడన్న మాట.

 బతకడం జీరో ఛాన్స్ అన్న వైద్యులు రిచర్డ్ స్కాట్ హచిన్సన్ పుట్టినప్పుడు మిల్లియా పలీస్లోని చిల్డ్రన్స్ మిన్నెసోటా దవాఖానాలో డాక్టర్ నియోనాటలజిస్ట్ స్టెపి కెర్న అభిప్రాయపడ్డారు.  సాధారణంగా ఆ బిడ్డ తల్లి గర్భం నుంచి బయటకు రావడానికి 40 వారాల సమయం పడుతుందని ఆయన అన్నారు.  గతంలోనే కెనడా  ఒట్టావాలో బ్రేడా జీన్స్ గిల్ దంపతులకు 1987, మే 20 న జన్మించిన జేమ్స్ ఎల్జిన్  గిల్  పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉండేది.  జేమ్స్ తల్లి గర్భంలో 21 వారాల ఐదు రోజులు మాత్రమే ఉన్నాడు.  రిచర్డ్ స్కాట్ విలియం ప్రపంచంలోనే అరుదైన చరిత్ర సృష్టించాడు.  జేమ్స్ ఎల్జిన్  గిల్  పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ను ఈయన ఖాతాలో వేసుకున్నాడు. కానీ ప్రపంచంలో ఇలాంటి అరుదైన సంఘటనలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. కానీ ఈ బుడతడు మాత్రం తన మొదటి పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: