ప్రకృతిలో మనకు లభించే ఎన్నో ఆకుకూరలు, కూరగాయలలో ఏదో ఒక ఔషధం ఇమిడి ఉంటుంది. అంతే కాదు వీటి వల్ల మన శరీరంలో ఎదురయ్యే ఎన్నో క్లిష్టతరమైన రోగాలను కూడా నయం చేసుకోవచ్చు. అందుకే మన రైతులు వాటిని వాణిజ్య పంటలుగా పండిస్తూ లాభార్జన కూడా చేసుకుంటున్నారు. ఇక మనకు అరుదుగా లభించే కాయగూరల్లో గోరుచిక్కుడు కూడా ఒకటి. అయితే ఈ గోరుచిక్కుడు ను ప్రాంతాలను బట్టి రకరకాలుగా పిలుచుకుంటూ ఉంటారు. చౌడేకాయ, మోటిక్కాయ, గోకరకాయ అని ఎవరికి నచ్చినట్టు వారు పిలుచుకుంటూ ఉంటారు. అయితే వీటిని ఎక్కువగా ఫ్రై రూపంలో, కూర రూపంలో, మజ్జిగలో నానబెట్టి, ఎండబెట్టి మరీ తింటూ ఉంటారు. ఇంతటి రుచికరమైన గోరుచిక్కుడు వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. అయితే వీటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..


1. రక్తంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి అవసరమయ్యే ఆహారంలో లభించే ఫైబర్ ను గోరుచిక్కుడు కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల రక్తంలో ఉన్న అధిక కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించుకోవచ్చు. గ్లూకోజ్ స్థాయిని కూడా తగ్గించే శక్తి ఈ గోరుచిక్కుడు ఉంది.

2 . ఇక ఇందులో లభించే కాల్షియం వల్ల ఎముకలు పటిష్టంగా తయారవుతాయి. అంతేకాదు దంతాలకు,ఎముకలకు  కావలసిన తగిన  కాల్షియం కూడా ఈ గోరుచిక్కుడు వల్ల లభిస్తుంది.

3. రక్తహీనతను తగ్గించి, రక్తప్రసరణను పెంచుతుంది.

4. ఇందులో యాంటీ బయోటిక్ అయిన విటమిన్ సి పుష్కలంగా లభించడం వల్ల మనలో రోగనిరోధక శక్తి పెరిగి, ఫ్లూ బారిన పడకుండా ఉంటాము.

5. ఉడికించి తినటం వల్ల వీటిలో ఉండే ఫోలేట్, పొటాషియమ్, ఫైబర్ వంటి పోషకాలు తగిన మోతాదులో శరీరానికి లభిస్తాయి.

6. శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ ను బయటకు పంపించి గుండె ఆరోగ్యాన్ని పదిలం చేస్తుంది.

7. మెదడును ఉత్తేజపరిచి, మతిమరుపు లేకుండా చేయడమే కాకుండా మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

8. ప్రతిరోజు జిమ్, ఎక్ససైజ్, మజిల్ ఇంప్రూవ్ చేసుకునేవారికి ఈ గోరుచిక్కుడు ఎంతగానో సహాయపడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: