ప్రస్తుతం వాతావరణం వేగంగా మారుతున్న కారణంగా డెంగ్యూ కేసులు తెరపైకి వస్తున్నాయి. పిల్లల నుంచి పెద్దలు, వృద్ధుల వరకు అందరూ అనారోగ్యం పాలవుతున్నారు. డెంగ్యూ అనేది దోమల ద్వారా వ్యాపించే ఫీవర్. ప్రతి సంవత్సరం దాని వ్యాప్తి సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్య కనిపిస్తుంది. తీవ్రమైన డెంగ్యూ ప్రాణాంతకమైన పరిస్థితిని తీసుకొస్తుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే దాని తీవ్రత పెద్దవారి కంటే పిల్లలలో చాలా ఎక్కువగా ఉంటుంది. మరోవైపు గర్భిణీ స్త్రీలు డెంగ్యూతో బాధపడుతుంటే ఆ బిడ్డ కూడా వ్యాధి బారిన పడవచ్చు. అదే సమయంలో వ్యాధి సోకిన తల్లి పాలు తాగడం ద్వారా బిడ్డ కూడా డెంగ్యూ బాధితుడిగా మారవచ్చు.

డెంగ్యూ అనేది ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపించే ఒక రకం వైరస్. ఈ దోమ ఎక్కువగా పగటి పూట కాటు వేస్తుంది. ఎక్కువగా ఈ దోమ సేకరించిన లేదా నిలిచిపోయిన నీటిలో గుడ్లు పెడుతుంది. కాబట్టి మీ ఇంటిలో డ్రైన్లు, కూలర్లు, పాత టైర్లు, విరిగిన పెట్టెలు మొదలైన చోట్ల నీరు ఉండకుండా శుభ్రంగా ఉంచుకోండి.  

ఈ లక్షణాలను గుర్తించండి :
డెంగ్యూ  ప్రారంభ లక్షణాలు దోమ కాటు తర్వాత రెండు నుండి మూడు రోజుల తర్వాత కనిపిస్తాయి. అటువంటి పరిస్థితిలో లక్షణాలను పట్టించుకోకుండా వదిలేయొద్దు. ఎందుకంటే ఈ సమస్య తీవ్రంగా మారితే అది ప్రాణాంతకం అవుతుంది. దాని లక్షణాలు...
- అధిక జ్వరం
- దగ్గు
- శ్వాస లోపం
- నోరు, పెదవులు, నాలుక పొడిబారడం
- వాంతులు
- బద్ధకం, బలహీనత, చిరాకు
- చేతులు, కాళ్ళు చల్లబడడం
- శిశువు మామూలు కంటే ఎక్కువగా ఏడుస్తోంది

ప్లేట్‌లెట్స్ వేగంగా తగ్గుతాయి
శరీరంలో రక్తం ప్రవహించడానికి ప్లేట్‌లెట్స్ అవసరం. కానీ డెంగ్యూ తీవ్రమైన స్థితికి చేరితే ప్లేట్‌లెట్‌లు వేగంగా తగ్గడం ప్రారంభిస్తాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తి శరీరంలో 1.5 లక్షల నుంచి నాలుగు లక్షల ప్లేట్‌లెట్‌లు ఉంటాయి. అది దాదాపు 20 వేలకు చేరితే అప్పుడు రక్తస్రావం మొదలవుతుంది. అలాగే ప్లేట్‌లెట్లను ఎక్కించాల్సి ఉంటుంది. డెంగ్యూ ప్రమాదకరంగా మారితే అవయవాలు ఫెయిల్ అయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇంట్లో దోమలోకి ప్రవేశించకుండా  కిటికీలు, తలుపులు కవర్ చేయండి. పూర్తి స్లీవ్‌లతో కూడిన బట్టలు ధరించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: